BB Telugu 8.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి సంబంధించి డిసెంబర్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాప్ -5లో నిలిచేది ఎవరు? అంటూ అభిమానులలోనే కాదు అటు ఆడియన్స్ లో కూడా ఉత్కంఠ రేకెత్తుతోంది. ముఖ్యంగా రోజురోజుకి తారుమారవుతున్న ఓటింగ్ చూస్తే మాత్రం టాప్ -5 లో నిలిచేది ఎవరో అర్థం కాక ఆడియన్స్ సైతం తలలు పట్టుకుంటున్నారు. టాప్ -5 లో ఉంటారనుకున్న యష్మి(Yashmi )ఎలిమినేట్ అయ్యింది. మరొకవైపు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన విష్ణు ప్రియ(Vishnupriya ), స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న పృథ్వి (Prithvi )కూడా ఇప్పుడు డేంజర్ జోన్ లో పడ్డారు. ఇక మిగిలిన వారు వైల్డ్ కార్డ్స్.. వీరు టాప్ ఫైవ్లోకి వచ్చినా.. టైటిల్ విన్నర్ గా ట్రోఫీ ఇచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి ఇంత ఉత్కంఠ రేపుతున్న ఓటింగ్ మధ్య టాప్ ఫైవ్ లో నిలిచేది ఎవరో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ ఒకటవ తేదీన దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయింది. మరొకవైపు ఆరవ వారం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మందిని హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్. ఆ తర్వాతే అసలైన ఆట మొదలైంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ మొదలైన పోటీ.. ఆఖరికి బలాబలాలు నిరూపించుకునే స్థాయికి చేరుకుంది. ఇక 11వ వారం ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఎలిమినేషన్స్ నుంచి కూడా తప్పించుకున్నారు. కానీ 12వ వారం అనూహ్యంగా నామినేషన్స్ లోకి వచ్చిన యష్మి ఓటింగ్ స్టార్ట్ అయిన మొదటి రెండు మూడు రోజులు రెండవ స్థానంలో ఉంది. కానీ వారం ముగిసే సమయంలో విష్ణు ప్రియ తో గొడవపడడం వల్లే ఓట్లు తగ్గిపోయాయి. దీంతో లీస్ట్ లోకి వచ్చిన ఈమె ఎలిమినేట్ అయిపోయింది.
ఇక తాజాగా 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ లిస్టులో మెగా చీఫ్ రోహిణి మినహా.. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, టేస్టీ తేజ, అవినాష్, నబీల్, పృథ్వీ, విష్ణు ప్రియ ఇలా వీరంతా కూడా నామినేషన్స్ లోకి వచ్చేసారు. ఇక రేపటితో ఓటింగ్ కాస్త ఎండ్ కానుంది. ఈ నేపథ్యంలోనే అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఎప్పటిలాగే గౌతమ్ అత్యధిక ఓటింగ్ సొంతం చేసుకొని మొదటి స్థానంలో ఉండగా.. ప్రేరణ తన ఆట తీరుతో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టైటిల్ విజేతగా నిలవబోయే నిఖిల్ మాత్రం మూడవ స్థానంతో సరిపెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక తర్వాత స్థానాలలో టేస్టీ తేజ, అవినాష్, నబీల్, పృథ్వీ, విష్ణు ప్రియ నిలిచారు.
ఇకపోతే మొన్నటి వారం వరకు టాప్ ఫైవ్ లో నిఖిల్, గౌతమ్ , ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ వీళ్లంతా కూడా ఇప్పుడు ఓటింగ్లో చాలా వెనుకబడిపోయారు. మరి టాప్ ఫైవ్ లో నిలవబోయేది ఎవరో తెలియాలి అంటే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఎదురుచూడాల్సిందే. ఏది ఏమైనా ఈ సీజన్లో మాత్రం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ను ఐడెంటిఫై చేయలేకపోతూ ఉండడం గమనార్హం.