E-Paper
Advertisement

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Motorola Phone Offer: ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ మోటోరోలాకు భారత్ లో మంచి గుడ్ విల్ ఉంది. తక్కువ బడ్జెట్ లో నాణ్యమైన, అధునాతన ఫీచర్లు కలిగిన ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన మోటొరోలా ఎడ్జ్ 50 (Motorola Edge 50).. మెుబైల్ ప్రియుల్లో మంచి ఆదరణ సంపాదించింది. అయితే ఈ ఫోన్ పై ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ.5000పైగా రాయితీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆఫర్ వివరాలతో పాటు.. ఈ ఫోన్ కు సంబంధించిన ప్రధాన ఫీచర్లు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అమెజాన్ ఆఫర్..

మోటొరోలా తన ఎడ్జ్ 50 (8GB RAM, 256GB స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ. 27,999గా నిర్ణయించింది. అయితే అమెజాన్ దీనిపై రూ.5,009 డైరెక్ట్ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ ఫోన్ ను రూ.22,990కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో రూ.745 రాయితీని సైతం అమెజాన్ అందిస్తోంది. వీటితో పాటు నెలకు రూ.808 చెల్లించేలా ఈఎంఐ వెసులుబాటును సైతం కల్పిస్తోంది. ఫలితంగా మెుదటి నెల రూ.808 కట్టి ఫోన్ పట్టుకెళ్లవచ్చని అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి.

కర్వ్‌డ్ డిస్‌ప్లే, డిజైన్

Advertisement

మోటొరోలా ఎడ్జ్ 50 మెుబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనికి 6.67 అంగుళాల pOLED కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని వెనుక వైపు ఉన్న వీగన్ లెదర్ ఫినిషింగ్ ఫోన్‌కు మంచి క్లాసీ లుక్ ను అందిస్తుంది. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో రావడం వల్ల చేతిలో పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది.

కెమెరా పనితీరు

ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్), 13MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా ఇచ్చారు. కాబట్టి ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

బ్యాటరీ, ఛార్జింగ్

Advertisement

ఇందులో 5000mAh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా మెుబైల్ ను యూజ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక బ్యాటరీకి 68W ఫాస్ట్ ఛార్జింగ్.. అలాగే 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీంతో పాటు IP68 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం వల్ల నీటిలో పడినా త్వరగా పాడవదు.

Also Read: సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

కొనాలా? వద్దా?

క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ (యాడ్స్ లేనిది), అద్భుతమైన డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, మంచి కెమెరా కావాలనుకుంటే రూ. 22 వేల బడ్జెట్‌లో ఈ ఫోన్ ను కచ్చితంగా కొనుగోలు చేయవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉండటం వల్ల.. హెవీ గేమ్స్ కోసం మాత్రం ఈ ఫోన్ అంతగా సపోర్ట్ చేయదని స్పష్టం చేస్తున్నారు. రెగ్యులర్ గా గేమ్స్ ఆడేవారు ప్రత్యామ్నాయం చూసుకుంటే బెటరని పేర్కొంటున్నారు.

Also Read: ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×