BigTV English

iPhone 14 @ ₹ 8,249: క్రేజీ ఆఫర్.. 4జీ ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14.. ఇది నేనేడ సూడలే!

iPhone 14 @ ₹ 8,249: క్రేజీ ఆఫర్.. 4జీ ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14.. ఇది నేనేడ సూడలే!

 


i phone 14
i phone 14

Buy iPhone 14 @ Rs 8,249 Only: ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. అందువల్లనే ఈ ఫోన్‌కు మార్కెట్‌లో ప్రత్యేక డిమాండ్ ఉంది. ధర ఎంత ఉన్నా.. కొనేందుకు కొందరు ముందు వెనుక ఆలోచించరు. ఈ కంపెనీ నుంచి కొత్త మోడల్ వస్తుందంటే పొలోమని ఆన్‌లైన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్లలో వెతికేస్తుంటారు.

అంతటి డిమాండ్ ఉంది మరి ఐఫోన్‌కు. ఈ ఫోన్‌ అంటే ఇష్టం ఉండనివారంటూ ఎవరూ ఉండరు. కానీ ధరల కారణంగా తమ ఇష్టా ఇష్టాలను మార్చుకుంటుంటారు కొందరు. మరి అలాంటి ఇష్టాన్ని ఇప్పటికే మార్చుకున్న ఫోన్ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్. తాజాగా ఐఫోన్‌లోని ఓ మోడల్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.


మరి ఇది వరకే కొనాలని ప్లాన్ చేసుకున్న వారు అధిక ధర కారణంగా వెనకడుగు వేసిన వారు ఇప్పుడు ఈ అధ్భుతమైన ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌తో అతి తక్కువ ధరలోనే అంటే 4జీ మొబైల్ కన్నా తక్కువకే ఐఫోన్‌ను కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: ఐఫోన్ 14పై క్రేజీ డీల్.. ధర. రూ.25 వేలు లోపే!

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో ఐఫోన్‌పై కళ్లు చెదిరే అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. తాజా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఐఫోన్‌ 14ను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ఈ ఫోన్ లాంచ్ సమయంలో దాదాపు రూ.79,900 ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఐఫోన్ 15 మార్కెట్‌లోకి రావడంతో ఐఫోన్ 14 ధర రూ.10000 తగ్గింది. ఇప్పుడు ఈ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999కి లిస్ట్ అయింది. అంటే అధికారిక ధర కంటే ఇప్పుడు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది.

కాగా దీనిపై పలు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. యూపీఐ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుపై రూ.750 వరకు తగ్గింపు అందుతుంది. అప్పుడు ఈ ఫోన్ రూ.56,249కి లభిస్తుంది. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.48,000 వేల వరకు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. అప్పుడు ఈ ఐఫోన్ 14 కేవలం రూ.8,249లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: రూ.20 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భలే ఆఫర్.. ఇప్పుడు రూ.749కే కొనేయొచ్చు..

అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ పనితీరు చాలా మెరుగుగా ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్, డ్యామేజ్‌లు ఉండకుండా మంచి కండీషన్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పూర్తిగా పొందవచ్చు.. లేదంటే మీ జేబులో నుంచి మరింత అమౌంట్‌ను పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మొత్తం ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే.. ఈ ఫోన్‌ను 4జీ మొబైల్ కంటే అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు అన్నమాట.

ఈ ఫోన్ శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది.ఇందులో 6.1 అంగుళాల భారీ డిస్‌ప్లేను అమర్చారు. ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. అలాగే కెమెరా క్వాలిటి అదిపోతుంది. మరి ఈ ఫోన్‌ను ఎప్పట్నుంచో కొనాలని ప్లాన్ చేస్తున్నవారు ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు.

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×