BigTV English
Advertisement

SIB Ex DSP Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. SIB మాజీ DSP ప్రణీత్‌రావుకి 14 రోజులు రిమాండ్!

SIB Ex DSP Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. SIB మాజీ DSP ప్రణీత్‌రావుకి 14 రోజులు రిమాండ్!

SIB EX DSP Praneeth Rao case updates


SIB EX DSP Praneeth Rao Case: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో SIB మాజీ DSP ప్రణీత్‌రావుకి ఉచ్చు బిగుస్తోంది. ప్రణీత్‌రావుకి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు ప్రణీత్‌రావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ చేశాడని ప్రణీత్‌పై వ్యాపారవేత్త శ్రీధర్‌రావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మార్చి 12 మంగళవారం రాత్రి ప్రణీత్ రావును సిరిసిల్లలోని ఆయన ఇంటిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. బుధవారం సాయంత్రం వరకూ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారణ చేసింది. ఆధారాల ధ్వంసానికి గల కారణాలపై ఆరా తీసింది.


Also Read: హైదరాబాద్ మరో బెంగళూరు కాకూడదు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)లో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింద..? ఎవరైనా ఆదేశించారా లేక సొంత నిర్ణయమా..? ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాడే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది..? అంటూ ప్రశ్నలు అడిగింది. కానీ విచారణలో ప్రణీత్ రావు చాలా ప్రశ్నలకు మౌనమే వహించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రణీత్ ఎస్ఐబీలో 42 హార్డ్ డిస్క్ లను తొలగించడం లేదా ధ్వంసం చేయడంతో పాటు వాటి స్థానంలో కొత్తవి అమర్చినట్లుగా ప్రత్యేకబృందం గుర్తించింది. ప్రణీత్ ఎస్ఐబీలో ఏమేం చేశారన్నదానిపై దర్యాప్తు బృందం ఆరా తీసింది. కొత్తగా అమర్చిన హార్డ్ డిస్క్ లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో వివరాలు అడిగినట్లు సమాచారం.

Tags

Related News

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Big Stories

×