E-Paper
Advertisement

iPhone 14 Plus Price Down: ఆఫర్ అద్భుతం.. రూ.9,648లకే ఐఫోన్ 14 ప్లస్!

iPhone 14 Plus Price Down: ఆఫర్ అద్భుతం.. రూ.9,648లకే ఐఫోన్ 14 ప్లస్!
Advertisement

iPhone 14 Plus Price Down: మార్కెట్‌లో ఆపిల్ గ్యాడ్జెట్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వలన కొందరు కొనలేకపోతున్నారు. దీంతో ఐఫోన్ లవర్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఆఫర్లు వస్తాయని ఎదురుచూస్తుంటారు. ధరలు తగ్గగానే కొనేస్తుంటారు. ఈ క్రమంలో మీరు కూడా ఐఫోన్ లవర్స్ అయితే మీకో అదిరిపోయే శుభవార్త ఉంది. ఈ కామర్స్ ఫ్లాట్‌‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌‌లో ఐఫోన్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్పటికే లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 14 ప్లస్‌ను తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది ఐఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప ఛాన్స్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 14 Plus Offer
ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ.79,600. కానీ ఫ్లిప్‌కార్ట్  ఈ సేల్‌లో ఇది రూ. 56,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఇది కాకుండా రూ.51,600 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.  ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రమే కాదు మీరు ఈ ఐఫోన్‌ను నెలవారీ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం నెలకు రూ.9,648 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

iPhone 14 Plus Features
ఐఫోన్ 14 ప్లస్ సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేతో 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే అద్భుతమైన క్లారిటీని అందిస్తోంది. దీనితో పాటు ఫోన్ స్పీకర్ బెస్ట్ సౌండ్ క్వాలిటీని ఇస్తుంది . ఐఫోన్ 14 ప్లస్‌లో సూర్యకాంతిలో కూడా రంగులు చాలా క్లియర్‌గా ఉంటాయి. ఫోన్‌లోని అన్ని కలర్స్ షార్ప్‌‌గా రియల్‌గా కనిపిస్తాయి. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుంది. iOS 60 Hzలో రన్ అవుతుంది.

Also Read: Motorola Edge 50 Launch: మోటో సందడి.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో కొత్త ఫోన్ లాంచ్!

Advertisement

కంపెనీ ఐఫోన్ 14 ప్లస్‌లో A15 చిప్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ ప్రాసెసర్‌లో ఐఫోన్‌ను రన్ చేయడంలో ఎలాంటి సమస్య లేదు. ఐఫోన్ 14 ప్లస్ హెవీ గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 14 ప్లస్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 12 MP మెయిన్ బ్యాక్ కెమెరా, రెండవ 12 MP అల్ట్రా-వైడ్ కెమెరా ఫ్లాష్ లైట్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆటో ఫోకస్ ఫీచర్‌తో 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×