BigTV English

Atchannayudu: బ్రేకింగ్ న్యూస్.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. ‘ఆ పెన్షన్లు తీసేస్తాం’

Atchannayudu: బ్రేకింగ్ న్యూస్.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. ‘ఆ పెన్షన్లు తీసేస్తాం’

Minister Atchannayudu Key Comments: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్లకు సంబంధించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బోగస్ పెన్షన్లను ఏరివేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు.


ఇదిలా ఉంటే.. ఏపీలో నేడు రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉదయం 8.30 గంటల వరకే దాదాపుగా 63 శాతానికి పైగా పింఛన్ల పంపిణీని అధికారులు పూర్తి చేశారు. మొత్తం 64.82 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా రూ. 1739 కోట్లు పంపిణీ చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండున్నర గంటల సమయంలోనే 64 శాతం పెన్షన్లను పంపిణీని పూర్తి చేయడం రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: ఒలింపిక్స్‌లో స్వప్నిల్ కుశాల్‌కు కాంస్యం.. విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం కంటే తక్కువ మంది సిబ్బందితోనే పింఛన్ల పంపిణీని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తామంటూ చంద్రబాబు పేర్కొన్నారు. నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల పెండింగ్ పింఛన్ తో కలిపి రూ. 7 వేలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఈ నెల నుంచి రూ. 4 వేల పెన్షన్ పంపిణీ చేస్తున్నది.

Related News

Tirumala: తిరుమ‌ల‌లో మ‌రో ఘోర అప‌చారం.. అలిపిరి మెట్ల వ‌ద్దే నాన్ వెజ్

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు, జగన్‌కు సన్నిహితుడా?

Nepal Crisis: ఫలించిన లోకేష్ కృషి.. నేపాల్ నుంచి స్వదేశానికి ఆంధ్రా వాసులు

Nepal: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని.. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

TTD Pink Diamond: శ్రీవారి పింక్ డైమండ్.. ఆర్కియాలజికల్‌ విభాగం క్లారిటీ, వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

YS Jagan: మావాళ్లు ఇంకా గేర్ మార్చలేదు.. బాధపడుతున్న జగన్

AP Politics: ఆ నేతలంతా జంప్? విజయనగరం వైసీపీలో ఏం జరుగుతుంది

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×