BigTV English

Mr Bachchan: ఏంటి తమ్ముళ్లు.. సీట్ దొరకలేదా.. మెట్రోలో రవితేజ వాయిస్.. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్

Mr Bachchan: ఏంటి తమ్ముళ్లు.. సీట్ దొరకలేదా.. మెట్రోలో రవితేజ వాయిస్.. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్

Mr Bachchan: సినిమా ఎలా ఉన్నా.. ప్రేక్షకులను థియేటర్ కు తీసుకురావడం మాత్రం మేకర్స్ బాధ్యత. దాన్నే ప్రమోషన్స్ అంటారు. ఈ కాలంలో అప్పటిలా పోస్టర్లు అంటించి.. రెండు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. దీంతో స్టార్ హీరోలు సైతం కొత్త కొత్తగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో హైప్ తీసుకొస్తున్నారు.


మొన్నటివరకు బస్సులు, ఆటోలు, ట్రైన్ లకు పోస్టర్లు అంటించి.. సినిమాకు రావాలని కోరేవారు. కానీ, ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ టీమ్ ఈ కొత్త ప్రమోషన్స్ కు నాంది పలికింది. మెట్రో ఎక్కగానే.. ద్వారం వద్ద నిలబడవద్దు.. ఏ స్టేషన్ వచ్చింది.. ఎక్కడ దిగాలి.. ఎలా దిగాలి అని వచ్చే అనౌన్స్ మెంట్ వింటూనే ఉంటాం.

ఇక నుంచి ఆ వాయిస్ తో పాటు మెట్రో ట్రైన్స్ లో రవితేజ వాయిస్ వినిపిస్తుంది. అంటే.. ఇప్పుడు రవితేజ ఆ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడా అంటే.. అది కాదు. మిస్టర్ బచ్చన్ గురించి చెప్పుకొస్తాడు. ” మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం. ఏంటి తమ్ముళ్లు.. మెట్రోలో సీట్ దొరకలేదా.. లేకపోతే కూర్చోగానే లేపేస్తున్నారా.. ఏం పర్లేదు. నీ స్టేషన్ వచ్చేవరకు నీకు ఎనర్జీ ఇచ్చేలా మిస్టర్ బచ్చన్ నుంచి కొత్త సాంగ్ వచ్చింది. హ్యాపీగా నిల్చుంటూ.. వినుకుంటూ వెళ్లిపోండి. ఇక్కడ సీట్ దొరకకపోయినా పర్లేదు. ఆగస్టు 15 న థియేటర్ కు వచ్చేయండి. అక్కడ సీట్ గ్యారెంటీ” అని రవితేజ తనదైన రీతిలో మాట్లాడి మెప్పించాడు.


ప్రతి మెట్రోలో రవితేజ వాయిస్ వచ్చేలా ఫిక్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా ఈ కొత్త ఐడియాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరి ఈ ప్రమోషన్స్ వలన మిస్టర్ బచ్చన్ కు ఎలాంటి లాభం చేకూరిందో చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×