BigTV English

Motorola Edge 50 Launch: మోటో సందడి.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో కొత్త ఫోన్ లాంచ్!

Motorola Edge 50 Launch: మోటో సందడి.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో కొత్త ఫోన్ లాంచ్!

Motorola Edge 50 Launch: మోటరోలా భారతదేశంలో మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50ని ఈరోజు అంటే ఆగస్టు 1, 2024న విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లో కొత్త వేరియంట్. ఇందులో ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉన్నాయి. లాంచ్‌కు ముందే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ను వెల్లడించింది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.


ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని MIL-810H-సర్టిఫైడ్ హ్యాండ్‌సెట్. ఈ ఫోన్ చాలా సన్నగా అలాగే మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనితో క్వాలిటీ ఫోటోలను క్యాప్యర్ చేయవచ్చు.

ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది ఫోన్‌ను వేగంగా రన్ చేస్తుంది. ఫోన్‌లో 5,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది మీకు రోజంతా బ్యాకప్ ఇస్తుంది. ఇది 68W వైర్డ్ టర్బోపవర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనిలో IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కంపెనీ ఈ మోటో ఫోన్‌కు మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లును అందిచనుంది.


మోటరోలా ఎడ్జ్ 50ని ఫ్లిప్‌కార్ట్, Motorola India అధికారిక వెబ్‌సైట్, ప్రధాన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. మిలిటరీ గ్రేడ్ MIL-810H సర్టిఫికేషన్ కలిగిన ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ ‌అని కంపెనీ వెల్లడించింది. Motorola Edge 50 ధర రూ. 27,999గా ఉంటుంది.

ఒప్పో‌లో కూడా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వచ్చే ఫోన్లు ఉన్నాయి. Oppo K12x 5G మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ కొంచెం మందంగా ఉంటుంది. ధర గురించి మాట్లాడినట్లయితే భారతదేశంలో K12x 5G ప్రారంభ ధర 6GB + 128GB వేరియంట్ కోసం రూ. 12,999. మోటరోలా కంటే ఇది చాలా చౌకైన ఫోన్. కానీ స్లిమ్, స్ట్రాంగ్ ఫోన్ కావాలనుకునే వారికి మోటరోలా బెస్ట్ ఆప్షన్.

Related News

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Budget Bikes: అమ్మతోడు.. ఈ ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే బైక్ షోరూంకి వెళ్లి కొనేస్తారు

Smart TV Offers: దసరాకి దుమ్ము రేపుతున్న ఆఫర్లు.. 70mm స్క్రీన్ కూడా ఈ టీవీల ముందు వేస్ట్ భయ్యా..

Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..

Big Stories

×