Flipkart Mobile Offers : బెస్ట్ టాప్ ఎండ్ ఫీచర్స్ ఉన్న హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లైఫ్ బ్యాటరీ కెపాసిటీ, స్మాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్సెట్ ఆండ్రాయిడ్ 14తో నడిచే సూపర్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న స్మార్ట్ ఫోన్ ధర చూసి భయపడి కొనేందుకు వెనక్కి తగ్గుతున్నారా? అయితే ఆలాంటి వారి కోసమే ఇది పర్ఫెక్ట్ టైమ్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, సూపర్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఓ స్మార్ట్ ఫోన్‌పై అదిరే సూపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఏకంగా రూ.42 వేల ధర ఉన్న ఫోన్‌ను రూ.30 వేల కన్నా తక్కువ ధరకే అందిస్తోంది. అవును మీరు చదువుతోంది నిజం. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే ఇంతకీ తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ అందిస్తోన్న ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి? దాన్ని ఫీచర్స్ ఏంటి? ఎలా కొనుగోలు చేయాలి? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏంటంటే? – ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సూపర్ డిస్కౌంట్‌ను, ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలాకు చెందిన ఎడ్జ్ 50 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్‌పై అందిస్తోంది. ఈ ఎడ్జ్ 50 ప్రో మోడల్ అసలు ధర రూ.41,999. ప్రస్తుతం ఇది ఫ్లిప్ కార్ట్‌లో రూ. 31, 999కే అందుబాటులో ఉంది. అంటే డైరెక్ట్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఇంకా మీ దగ్గర ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈ డీల్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్ డీల్ కూడా పొందొచ్చు. అలానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.1200 వరకు తక్కువకు పొందొచ్చు. ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది.
ఈ ఆఫర్లతో పాటు ఎడ్జ్ 50 ప్రో అంతకన్నా తక్కువకు కావాలంటే ఎక్సేంఛ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. అయితే అది మీ పాత స్మార్ట్ ఫోన్ పని తీరు, బ్రాండ్‌పై అది ఆధారపడి ఉంటుంది. అలా మీరు ఎడ్జ్ 50 ను రూ.30 వేల కన్నా తక్కువకు దక్కించుకోవచ్చు.
మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్స్ – మోటో ఎడ్జ్ 50 ప్రోలో 6.7 అంగుళాల 1.5K పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్ ప్లే వచ్చింది. 144Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తూ, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హెలో యూఐతో పని చేస్తుంది.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌కు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగా పిక్సల్ టెలిఫొటో లెన్స్ అమర్చారు. సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరాను అమర్చారు.
ఇంకా ఈ స్మార్ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్‌కు, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐపీ68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
ALSO READ : ప్లీజ్ చచ్చిపో, చచ్చిపో… స్కూల్ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఏఐ డేంజరస్ ఆన్సర్