ORTUS School: హైదరాబాద్ లోని కోకాపేట ఎడ్యుకేషన్ హబ్ గా మారుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏర్పాటు కాగా, ఇప్పుడు మరో అంతర్జాతీయ స్కూల్ ప్రారంభం అయ్యింది. ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ తన తొలి క్యాంపస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినూత్నమైన విద్యభ్యాసం, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆర్టస్ స్కూల్ లో సీబీఎస్ఈ, కేంబ్రిడ్జ్ సిలబస్ తో కూడిన ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ను అందించనున్నట్లు తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, మానవ విలువలు, సృజనాత్మక ఆలోచనలతో సరికొత్త అభ్యాసాన్ని ఇక్కడ అందించనున్నట్లు వెల్లడించారు.
ఆర్టస్ స్కూల్ లోగో, బ్రోచర్ ఆవిష్కరణ
తాజాగా ఈ స్కూల్ కు సంబంధించిన లోగో, బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టస్ అధినేత, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న మండవ కీలక విషయాలు వెల్లడించారు. “మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో సాంప్రదాయ పద్ధతులు చాలా తక్కువగా ఉన్నాయని మేము గుర్తించాము. ఆర్టస్ సమగ్రమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. అత్యాధునిక సాంకేతికత, నాన్ లీనియర్ బోధనా విధానాన్ని అమలు చేయబోతున్నాం. విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా వారిని ఆయా రంగంలో ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం” అని చెప్పుకొచ్చారు.
Read Also: గురుకులాల్లో నాసిరకం భోజనంపై సీఎం రేవంత్ సీరియస్.. ఊచలు లెక్కబెట్టిస్తానంటూ వార్నింగ్!
ఆర్టస్ విద్యాలయం విద్యార్థులకు సమగ్ర విద్యను అందించబోతోందని సహ వ్యవస్థాపకుడు నాగ తుమ్మల తెలిపారు. “వైవిధ్యమైన ఎడ్యుకేషన్ విధానాలు, సాంకేతికత అభ్యాసం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నాం. ఓక్రిచ్, వికాస్ లాంటి స్కూళ్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన రాజ్ యార్లగడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులను అద్భుతమైన భావి భారత పౌరులను తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించబోతుందన్నారు. “ప్రపంచ స్థాయి స్కూల్ అట్మాస్పియర్ ను అందిస్తున్నాం. విద్యార్థులకు ఈ పాఠశాల అద్భుతమైన స్కిల్స్ అందించబోతుంది. హైదరాబాద్ లోని టాప్ విద్యా సంస్థల్లో ఒకటిగా నిలువబోతోంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజాగా ఆర్టస్ స్కూల్ కు సంబంధించిన లోగో, బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ కరుణాకరరావు దాసరి, మహేశ్ లంకిపల్లి, అనిరుధ్ రెడ్డి జిల్లెల, యసస్విని మండవ, నితిన్ రెడ్డి జిల్లెల సహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రత్యేక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కూచిపూడి నాట్యం, మోడ్రన్స్ డ్యాన్సులు, పాటలు అలరించారు.
Read Also: కోచింగ్ లేకుండానే 8 గవర్నమెంట్ జాబ్స్.. అదరగొట్టిన ఓరుగల్లు బిడ్డ!