BigTV English

Matka Movie Collections : కోట్లు ఎక్స్‌పెక్ట్ చేశారు… కానీ లక్షల్లోనే ఆగిపోయింది..

Matka Movie Collections : కోట్లు ఎక్స్‌పెక్ట్ చేశారు… కానీ లక్షల్లోనే ఆగిపోయింది..

Matka Movie Collections : టాలీవుడ్‌లో ఇప్పుడు మట్కా మూవీనే టాక్ ఆఫ్ ది టౌన్. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. నిజానికి ఓ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నంత మాత్రన ఇలాంటి మాటలు కానీ, ట్రోల్స్ కానీ రావు. కానీ, ఇక్కడ మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరో. అందులోనూ ఆయన లాస్ట్ మూవీ ఘోరమైన డిజాస్టర్. ఇప్పుడు కూడా అలాంటి రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మట్కా మూవీ కలెక్షన్ల గురించి చూద్ధాం…


మట్కా కలెక్షన్ల గురించి మాట్లాడకపోవడమే బెటర్ అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే, వరుణ్ తేజ్ 10 ఏళ్ల కెరీర్‌లో అత్యంత బిగ్ డిజాస్టర్ అంటే.. గాంఢీవధారి అర్జున. ఈ సినిమాకు ఫుల్ థియేట్రికల్ రన్‌లో వచ్చింది కేవలం 3.1 కోట్లు మాత్రమే. 46 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీకి కేవలం 3 కోట్లే వచ్చాయి. ఇప్పుడు మట్కాకు దాని కంటే దారుణమైన పరిస్థితి ఉంది.

Read Also : దారుణంగా పడిపోయిన ‘ మట్కా ‘ కలెక్షన్స్.. రెండు రోజులకు ఎన్ని కోట్లంటే?


ఈ మట్కా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఇక రెండు రోజు టాక్ బయటికి వెళ్లడంతో ఈ నెంబర్ భారీగా తగ్గి.. 20 లక్షల దగ్గరే ఆగిపోయింది. అంటే మొదటి రెండు రోజుల్లో మట్కా మూవీకి వచ్చిన షేర్ కేవలం 56 నుంచి 60 లక్షల మాత్రమే. ఇక మూడో రోజు ఈ మట్కా మూవీకి దాదాపు 11 లక్షల వరకు కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది.

ఈ మూవీని దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే హైయెస్ట్. ఈ మూవీ నైజం రైట్స్‌ 7 కోట్లు, ఆంధ్రలో అన్ని ఏరియాలకు కలిపి 8 కోట్ల వరకు వచ్చాయి. అంటే మొత్తం ఈ సినిమాకు 15 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మట్కా నిర్మాతలకు లాభాలు రావాలంటే… ఫుల్ థియేట్రికల్ రన్‌లో 16 కోట్ల షేర్ / 32 కోట్ల గ్రాస్ రావాలి. కానీ, మన మట్కా సినిమాకు మొదటి రోజు వచ్చింది కేవలం 36 లక్షలు. రెండో రోజు 20 లక్షలు. ఇక మూడో రోజు 11 లక్షలే. మొత్తం మీద ఈ మూడు రోజులు కలిపి కోటి రూపాయలు కూడా వచ్చినట్టు లేవు. పైగా ఇప్పుడు ఈ మట్కా సినిమాకు స్క్రీన్స్ భారీగా తగ్గాయి. అంటే తర్వాత రోజుల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.

Read Also‘మట్కా’ మూవీ రివ్యూ

నిజానికి సినిమా రిలీజ్ ముందు ఓపెనింగ్స్ గానీ, తర్వాత రోజుల్లో వచ్చే కలెక్షన్లు గానీ, కోట్లల్లో ఉంటాయని టీం అంచనా వేసింది. కానీ, ఇప్పుడు చూస్తే లక్షలు మాత్రమే కానిపిస్తున్నాయి. అంతే కాదు, మూడు రోజులు అవుతున్నా.. షేర్ కోటి రూపాయలు కూడా దాటలేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×