BigTV English

Discount on Samsung Galaxy S23 FE: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. సామ్‌సంగ్ కొత్త 5జీ ఫోన్‌పై రూ. 45,000 భారీ డిస్కౌంట్!

Discount on Samsung Galaxy S23 FE: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. సామ్‌సంగ్ కొత్త 5జీ ఫోన్‌పై రూ. 45,000 భారీ డిస్కౌంట్!

Rs 45,000 Discount on New Samsung Galaxy S23 FE Mobile: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్ గతేడాది అక్టోబర్‌లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు, వినియోగదారులకు అద్భుతమైన కెమెరా క్వాలిటీ, శక్తివంతమైన ప్రాసెసర్ సౌకర్యం ఇవ్వబడింది.


ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు దీన్ని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ కొనసాగుతుంది. ఈ సేల్‌లో Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ మే 9 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ ఫోన్ 8/128జీబీ అసలు ధర రూ.79,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 56 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో ఈ 5జీ ఫోన్ దాదాపు సగం ధరకే అంటే రూ.34,999కే లిస్ట్ అయింది. అంటే దీనిపై ఏకంగా రూ.45000 తగ్గింపు లభించింది అన్నమాట. అలాగే పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.


Also Read: రూ.79,999 ధర గల SAMSUNG Galaxy S23 FE ఫోన్.. కేవలం రూ.42,499కే!

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5% వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ 5జీ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.

అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.31,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో దీన్ని కేవలం రూ. 3,499లకే లభిస్తుంది. అయితే కస్టమర్లు ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. ఇంతటి భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ, హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అంతేకాకుండా పిన్‌ కోడ్ బట్టి కూడా వాల్యూ మారే అవకాశం ఉంది. అందువల్ల కొనేముందు ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్రీమ్, గ్రాఫైట్, మింట్, పర్పుల్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

Also Read: Vivo Y18 Series Launched : వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4-అంగుళాల డైనమిక్ ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది IP68 సర్టిఫికేట్ పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ Exynos 2200 చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. 50MP ప్రైమరీ సెన్సార్, 12MP సెకండరీ సెన్సార్, మాక్రో సెన్సార్ అందించబడ్డాయి. 10MP ఫ్రంట్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్, సెల్ఫీలను ఆస్వాదించవచ్చు.

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×