Top 5 Controversial Umpiring Incidents in IPL 2024: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 50కి పైగా మ్యాచ్‌లు పూర్తి చేసి దుమ్ము రేపింది. అనేక మంది పోటీదారులు లీగ్ దశలో మొదటి-నాలుగు స్థానాలకు పోటీపడుతున్నారు. 50 మ్యాచులు పూర్తయినా ప్లేఆఫ్‌లకు వెళ్లే మార్గం ఇప్పటికీ స్పష్టంగా లేదు.
టోర్నమెంట్ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సీజన్లోని అంపైరింగ్ ప్రమాణాలపై కొన్ని చీకటి మచ్చలు ఉన్నాయి. టోర్నీలో పలు అంపైరింగ్ నిర్ణయాలను క్రికెట్ పండితులు విమర్శించారు. IPL 2024లో అంపైరింగ్ ప్రమాణాలను దెబ్బతీసిన ఐదు సంఘటనలను ఒక సారి చూద్దాం.
విరాట్ కోహ్లి నోబాల్ ఔట్
RCB vs KKR మ్యాచ్ నెం.36లో ఈ సంఘటన జరిగింది. కోల‌్‌కతా బౌలర్ హర్షిత్ రాణా ఫుల్ టాస్ బాల్ వేయగా కోహ్లీ దాన్ని డిఫెండ్ చేయబోయి అవుట్ అయ్యాడు. కాగా నోబాల్ అని విరాట్ కోహ్లీ రివ్వూ కోరాడు. ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించగా థర్డ్ అంపైర్ కూడా దాన్ని అవుట్‌గా నిర్ణయించడంతో కోహ్లీ అవాక్కయ్యాడు. దీంతో అతను అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అలాగే సీరియస్‌గా వెళ్లి డగౌట్‌లో ఉన్న డస్ట్ బిన్‌ను తన్నడం వివాదాస్పదంగా మారింది. కాగా బెంగళూరుకు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మ్యాచ్.
Also Read: LSG vs KKR IPL 2024 Preview: సమ ఉజ్జీల పోరు.. నేడు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్ కతా
ట్రావిస్ హెడ్ స్టంపింగ్ మనుగడ
SRH vs RR మ్యాచ్ నెం.50లో SRH బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్టంపింగ్ అవుట్‌ను అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. SRH బ్యాటింగ్‌లోని 15వ ఓవర్‌లో హెడ్ అవేష్ ఖాన్‌తో తలపడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దూరంగా వెళ్తున్న బంతిని ఛేజ్ చేయడానికి బ్యాటర్ అడ్డంగా కదిలాడు కానీ అతను దాని మీద పట్టు కోల్పోయాడు. వికెట్ కీపర్ సంజు శాంసన్ బంతిని విసిరాడు.. అది స్టంప్స్‌ను గిరాటేసింది.అప్పుడు హెడ్ బ్యాట్ గాలిలో ఉంది.
కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. సైమన్ కటిచ్, ఆ బ్యాట్ ఖచ్చితంగా గాలిలో ఉందని పేర్కొన్నాడు. ఈ నిర్ణయం RR క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కరను కూడా కలవరపెట్టింది.
Also Read: PBKS vs CSK Preview IPL 2024: పంజాబ్ కింగ్స్ ఈసారి ఏం చేస్తుంది? నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ
ఎంఎస్ ధోని వైడ్ బాల్
టోర్నమెంట్‌లో LSGతో జరిగిన మ్యాచ్‌లో CSK ఇచ్చిన వైడ్ బాల్ అనేది పరిశీలనలో ఉన్న మరో నిర్ణయం. MS ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మొహ్‌సిన్ ఖాన్ బౌలింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మొహ్‌సిన్ ఖాన్ బంతిని దూరంగా సంధించడంతో ధోనీ బ్యాట్ కింద నుంచి బాల్ పాస్ అయ్యింది. కానీ అంపైర్ దాన్ని వైడ్ గా ప్రకటించాడు. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు.
Also Read:
నూర్ అహ్మద్ క్యాచ్
అంపైర్లు ఇచ్చిన మరో వివాదాస్పద నిర్ణయంలో, ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడినప్పుడు జరిగింది. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్ అద్భుతమైన క్యాచ్ ప్రయత్నంలో పృథ్వీ షా అవుట్ అయ్యాడు. డీసీ బ్యాటింగ్ నాలుగో ఓవర్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది. షా డీప్ మిడ్-వికెట్ వైపు ఒక భారీ షాట్ ఆడాడు. కాగా అటువైపు ఫీల్డింగ్ చేస్తున్న నూర్ అహ్మద్ కొంత మైదానాన్ని కవర్ చేసి క్యాచ్ కోసం అద్భుతమైన డైవింగ్ ప్రయత్నం చేశాడు. థర్డ్ అంపైర్ క్యాచ్‌ను పరిశీలించి, దానిని చట్టబద్ధమైన క్యాచ్‌గా పేర్కొన్నాడు. అయినప్పటికీ, ఫీల్డర్ దానిని పౌచ్ చేసినప్పుడు చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు బంతిని నేలకి తాకినట్లు విశ్వసించారు.
Also Read: MI vs KKR Match Highlights: ముంబై వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ విశేషాలు ఎన్నో.. 12 ఏళ్ల తర్వాత..!
శివమ్ దూబే వైడ్ డెలివరీ కాల్
లక్నో చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో మరో వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సీఎస్కే బ్యాటింగ్ ఇన్నింగ్స్ 18 ఓవర్లో యశ్ వైడ్ యార్కర్‌ను సంధించగా అంపైర్ వైడ్ ప్రకటించాడు. దీంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సమీక్ష కోరాడు. ఈ లోపే కేఎల్ రాహుల్ అంపైర్‌తో సీరియస్ గా మాట్లడాడు. అలాగే శివమ్ దూబేతో కూడా మాట్లాడాడు. కాగా థర్డ్ అంపైర్ కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే సమర్ధించి వైడ్‌గా ప్రకటించాడు. దీంతో కేఎల్ రాహుల్ అవాక్కయ్యడు.