BigTV English

Brahmamudi Serial Today October 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  దుగ్గిరాల కుటుంబానికి షాక్‌ ఇచ్చిన కావ్య – అనామికతో కలిసి అవార్డు  అందుకున్న కావ్య

Brahmamudi Serial Today October 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  దుగ్గిరాల కుటుంబానికి షాక్‌ ఇచ్చిన కావ్య – అనామికతో కలిసి అవార్డు  అందుకున్న కావ్య

Brahmamudi serial today Episode: రాజ్‌ కు సారీ చెప్పమని కావ్యకు స్వప్న చెప్తుంది. దీంతో నేనెందుకు  చెప్పాలి అక్కా సారీ. ఒకవేళ నేను సారీ చెబితే ఆయన మారతారనుకుంటే ఇప్పటికే లక్ష సార్లు మారి ఉండాలి. ఎందుకంటే మా పెళ్లి అయినప్పటి నుంచి నేను ఆయనకు లక్ష సార్లు సారీ చెప్పి ఉంటాను అటుంది కావ్య. ఆయనకు నా మీద ప్రేమే లేదు. ఒకవేళ ఉంటే ఆయన ఇప్పటికే సారీ చెప్పి నన్ను తీసుకెళ్లేవారు అంటుంది. ఇప్పటికైనా ఆయన సారీ చెబితే ఇప్పటికిప్పుడు ఇటు నుంచి ఇటే అత్తయ్య గారి దగ్గరకు వెళ్లి క్షమాపణ అడుగుతాను అంటుంది. దీంతో ఇదంతా అయ్యేది కాదని స్వప్న వెళ్లిపోతుంది.


ఎక్స్‌ ఫో న్యాయ నిర్ణేతలు అవార్డు విన్నర్‌ ను ప్రకటిస్తుంటారు. అయితే రాజ్‌ నువ్వే ఈసారి కూడా విన్నర్‌ అంటూ రుద్రాణి రాజ్‌ను వెళ్లు రాజ్‌  అంటుంది. దీంతో పేరు ప్రకటించిన తర్వాత వెళ్తానుగా అత్తయ్యా అంటూ రాజ్‌ చెప్తుంటాడు. రుద్రాణి బలవంతంగా రాజ్‌ ను వెళ్లు అనగానే రాజ్‌ కుర్చీ లోంచి లేచి వెళ్లబోతుంటే ఈ సంవత్సరం అవార్డు విన్నర్‌ సామంత్‌ జ్యువెల్లరీ అని ప్రకటిస్తారు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. సుభాష్‌, కావ్య, స్వప్న ఇంట్లో టీవీలో లైవ్‌  చూస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్‌ అవుతుంది.

సామంత్‌ అందరి చప్పట్ల మధ్య స్టేజీ మీదకు వెళ్తాడు.  నేను నెంబర్‌ వన్‌ పొజిషన్‌కు రావడానికి చాలా టైం పట్టింది. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డు వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఫైనల్‌ గా సాధించగలిగాను. ఏ మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ నా ఈ విజయం వెనక ఇద్దరు స్త్రీలు  ఉన్నారని అందులో ఒకరు నేను పెళ్లి చేసుకోబోయే అనామిక. రెండో స్త్రీ మా కంపెనీ విజయానికి కారణమైన మ సంస్థ క్రియేటివ్‌ డిజైనర్‌ మిసెస్‌ కావ్య అని చెప్తాడు సామంత్‌. దీంతో కావ్యనే కాదు రాజ్‌ కూడా మరింత షాక్‌ అవుతారు. రుద్రాణి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తుంది.


ఈ ఆవార్డు అందుకునే అర్హత మాకన్నా.. మా డిజైనర్‌ కావ్యకే ఉంది అని సామంత్‌ చెప్పడంతో కావ్య కోపంగా ఏంటి సురేష్‌ గారు నేను డిజైన్స్‌ వేసింది వేరే కంపెనీకి కదా..? అని నిలదీస్తుంది. దీంతో ఆ కంపెనీ కూడా సామంత్‌ గ్రూప్‌ వాళ్ల బినామీనే అమ్మా మీకు తెలియదా? అంటాడు. ఇంతలో సామంత్‌ కావ్యను స్టేజీ మీదకు  రావాలని పిలుస్తాడు. అదేంటి నన్ను పిలుస్తున్నారు. వాళ్ల ఏడుపు ఏదో వాళ్లు ఏడవమనండి. ఇందులోకి నన్నెందుకు లాగుతున్నారు. నేను తీసుకోను అంటుంది కావ్య.

కావ్య రాకపోవడంతో అనామిక కూడా కావ్య స్టేజీ మీదకు వచ్చి అవార్డు తీసుకో.. మిసెస్‌ కావ్య ఇది మీ అవార్డు మీరే తీసుకోవాలి రండి అని పిలుస్తుంది. దీంతో సురేష్‌ కూడా అమ్మా మీరు ముందు వెళ్లి అవార్డు తీసుకోండి తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. అందరూ చూస్తున్నారు  అమ్మా వెళ్లండి అని చెప్తాడు. కానీ కావ్య నేను ఈ అవార్డు తీసుకోను మీరెందుకు ఇలా చేస్తున్నారు. నేను ఈ అవార్డు తీసుకుంటే వ్యక్తిత్వం లేని దాన్ని అయిపోతాను. అంటుంది. మరోసారి అనామిక కావ్యను స్టేజీ మీదకు రమ్మని పిలుస్తుంది. దీంతో కావ్య భయంగా స్టేజీ మీదకు వెళ్తుంది.

కోపంగా అనామికను చూస్తూ ఇదంతా నీ పన్నాగమా? నాకు తెలియకుండా ఇంత మోసం చేస్తావా? నువ్వు కావాలనే మోసం చేశావు కదూ  అంటూ ప్రశ్నిస్తుంది. అదేమీ  పట్టించుకోకుండా అనామిక మా కంపెనీకి అవార్డు రావాలని కావ్య చాలా కష్టపడింది. ఈ అవార్డు మేము తీసుకోవడం కన్నా కావ్య తీసుకోవడమే సముచితం అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా చూస్తుంటాడు. రుద్రాణి రాజ్‌ను రెచ్చగొడుతుంది.  వాళ్లిద్దరు ఒక్కటై మన ఇంట్లోంచి బయటకు వెళ్లగానే ఎలా రివేంజ్‌ తీర్చుకుంటున్నారో చూడు రాజ్‌  అంటుంది.

ఇంట్లో లైవ్‌ లో చూస్తున్న వాళ్లు షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ మాత్రం కావ్యను తిడుతుంది. ఆమె నిజస్వరూపం నాకు ముందే తెలుసు కాబట్టి నేనేం షాక్‌ కాలేదు అంటుంది. మరోవైపు కావ్య అవార్డు తీసుకుని వెళ్లిపోతుంటే  న్యూస్‌ చానెల్‌ జర్నలిస్టులు వచ్చి కావ్యను ప్రశ్నిస్తారు. మీరు దుగ్గిరాల ఇంటి కోడలు అయ్యుండి వారి కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటి? మీరు మీ భర్త రాజ్‌తో విడిపోయారంట కదా నిజమేనా అని అడగడంతో కావ్య ఏడుస్తూ అక్కడి  నుంచి వెళ్లిపోతుంది.

బయట మెయిన్‌  డోర్‌ దగ్గర ఉన్న కావ్య దగ్గరకు వచ్చిన స్వప్న ఇంకా ఇక్కడే ఉంటే గొడవ మరింత పెద్దది అవుతుందే.. వెళ్లిపోవే.. ఇక్కడి నుంచి అని చెప్తుంది. ఇంతలో లోపలి నుంచి రాజ్‌, రుద్రాణి, సుభాస్‌ వస్తారు. కావ్య ఏడుస్తూ ఉంటే రాజ్‌ కంగ్రాచ్యులేషన్‌.. అద్బుతం నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నాను. మాటంటే పడటం అలవాటు లేదనుకున్నాను.  కానీ నీలో చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థం అయింది కళావతి. నీకు అనామికకు ఏమాత్రం తేడా లేదని నిరూపించావు అంటాడు. దీంతో కావ్య మీరు  చూసింది ఏదీ నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని చెప్తుంటే రాజ్‌ కోపంగా ఏది నిజం కాదు నా కళ్లతో నేను చూసింది నిజం కాదా? అంటూ ప్రశ్నిస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి ఏపిసోడ్  అయిపోతుంది.

Tags

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×