China Spacesuit| అంతరిక్ష ప్రయాణం చేసి చంద్రుడిపై వెళ్లే ఆస్ట్రనాట్స్ (వ్యోమగాములు) కోసం చైనా ఒక తేలికపాటి స్పేస్ సూట్ తయారు చేసింది. చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సిఎంఎస్ఏ) నాలుగేళ్ల పరిశోధన చేసి ఈ సూట్‌ని తయారు చేసిందని చైనా వార్తా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. చంద్రుడిపై వెళ్లే ఆస్ట్రనాట్స్ లకు 2030 కల్లా ఈ సూట్ అందుబాటులోకి ఉంటుందని గత శనివారం ఈ స్పేస్ సూట్ ప్రదర్శన సమయంలో సిఎంఎస్ఏ పరిశోధకులు వెల్లడించారు.
చంద్రుడిపై వెళ్లినప్పుడు ఆస్ట్రనాట్స్ అంతరిక్ష విమానం నుంచి బయటి వచ్చి పనులు చేయాల్సిన సమయంలో అతి తక్కువ బరువు ఉన్న ఈ స్పేస్ సూట్.. జాబిల్లిపై ఉన్న కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని, అక్కడ దుమ్ము, రేడియేషన్ నుంచి ఈ స్పెషల్ సూట్ కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు. స్పేస్ సూట్ తేలికగా ఉండడంవల్ల చంద్రుడి ఉపరితలంపై నడవడానికి ఆస్ట్రోనాట్స్ కు చాలా ఈజీగా ఉంటుందని అన్నారు.
Also Read: సోషల్ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్ చేసేందుకు హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్!
సిఎంఎస్ఏ విడుదల చేసిన ఒక వీడియోలో ఝాయి ఝింగ్‌గ్యాంగ్, వాంగ్ యపింగ్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఈ స్పేస్ సూట్ ని ధరించి చూపించారు. ఈ కొత్త స్పేస్ సూట్ లో లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ కెమెరాలు, ఆపరేషన్స్ కన్సోల్, గ్రేర్ ప్రూఫ్ హెల్మెట్ వైజర్ లాంటి హై టెక్ ఫీచర్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ సూట్ వేసుకొని ఆస్ట్రోనాట్స్ ఈజీగా నిచ్చిన ఎక్కడం, కిందికి వంగడం లాంటివి సులువుగా చేయగలరని చూపించారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చూసి ప్రముక బిలియనీర్, స్పేస్ ఎక్స్ సిఈఓ ఎలన్ మస్క్ స్పందించారు. వీడియోపై కామెంట్ చేస్తూ.. ”ఇదే సమయంలో అమెరికాలోని ఫెడరల్ ఏమియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆవిష్కరణల విషయంలో నేషనల్ స్పేస్ ప్రొగ్రామ్ సంస్థ పరిశోధనలు (ఇలాంటి స్పేస్ సూట్) ఇంకా డిజైనింగ్ దశలోనే ఉన్నాయి. వాటిని వేసుకుంటే ఆస్ట్రోనాట్స్ కు ఊపరితీసుకునేందకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.” అని ఇండైరెక్ట్ సెటైర్ వేశాడు.
భూమి కంటే చంద్రుడిపై వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. భూమిపై ఆస్ట్రోనాట్స్ అడుగు పెట్టిన తరువాత అక్కడ సోలార్ రేడియేషన్ భూమి కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. పైగా వాతావరణంలో వ్యాక్యూమ్ లెవెల్ ప్రెజర్ కూడా అధికంగా ఉంటుంది. చైనా ఆవిష్కరించిన ఈ ప్రత్యేక స్పేస్ సూట్ ఎరుపు, తెలుపు కలర్ లో ఉంది. చంద్రుడిపై ఉండే దుమ్ము, వేడిని తట్టకునేలా ఒక ప్రత్యేక ఫ్యాబ్రిక్ తో దీన్ని తయారు చేశారు. ఇందులో ప్రత్యేక గ్లోవ్స్.. చంద్రుడిపై తక్కువ గ్రావిటీ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి.
Also Read: కేవలం నిద్రపోతూ రూ.9 లక్షలు సంపాదించిన యువతి!.. ఎలా చేసిందంటే?..
అంతరిక్ష పరిశోధనలో మిగతా దేశాలకంటే చైనా పై చేయి సాధించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అంతరిక్షంలో ముఖ్యంగా చంద్రుడిపై పరిశోధనలు చేస్తే.. అక్కడ లభించే అమూల్యమైన ప్రకృతి సంపదతో లాభాలు పొందాలని అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి.
చంద్రుడిపై 1972లో ఆస్ట్రోనాట్స్ ని పంపిన అమెరికా.. ఈ దశకంలోనే మరోమారు చంద్రుడిపై ప్రయోగాలు చేయనుంది. ఆర్టెమిస్ -3 పేరుతో ప్రారంభించిన ఈ విషన్ లో భాగంతా 2026 సెప్టెంబర్ లో అమెరికా ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్లనున్నారు.