E-Paper
Advertisement

AI Runs Company: మనుషులు ఇక అవసరం లేదు? పూర్తిస్థాయిలో కంపెనీ నడుపుతున్న ఏఐ చాట్‌బాట్స్

AI Runs Company: మనుషులు ఇక అవసరం లేదు? పూర్తిస్థాయిలో కంపెనీ నడుపుతున్న ఏఐ చాట్‌బాట్స్
Advertisement

AI Runs Company| ప్రపంచవ్యాప్తంగా AI టెక్నాలజీ వల్ల ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చలో అమెరికాలోని ఫ్లోరిడా డిఫెన్స్ టెక్ వ్యవస్థాపకుడు ఏరన్ స్నీడ్ ఒక పెద్ద దావా చేశాడు. తన కంపెనీ మొత్తాన్ని ఏఐ ఏజెంట్లతోనే నడుపుతున్నానని చెప్పాడు. హెచ్ఆర్, లీగల్, సప్లై చైన్, క్వాలిటీ కంట్రోల్ వంటి డిపార్ట్‌మెంట్లన్నీ AIల నిర్వహిస్తున్నాయని వెల్లడించాడు. డేటా ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ పనులు కూడా AI చేస్తున్నాయట. GPT ఆధారిత సిస్టమ్స్ వల్ల ఆపరేషనల్ ఖర్చులు చాలా తగ్గాయి. వారానికి దాదాపు 20 గంటలు సమయం ఆదా అవుతోంది. AI కేవలం సహాయక సాధనం కాదు, ఆపరేషనల్ అవసరంగా మారిందని స్నీడ్ చెబుతున్నాడు.

“ది కౌన్సిల్” అనే AI ఏజెంట్ల గ్రూప్

బిజినెస్ ఇన్‌సైడర్ ఇంటర్వ్యూలో స్నీడ్ వివరాలు చెప్పాడు. సుమారు 15 AI ఏజెంట్ల గ్రూప్‌ను సృష్టించాడు. ఈ గ్రూప్‌ని “ది కౌన్సిల్” అని పిలుస్తున్నాడు. ఈ గ్రూప్ మధ్యలో “చీఫ్ ఆఫ్ స్టాఫ్” AI ఏజెంట్ ఉంటుంది. ఇది అన్ని టాస్క్‌లను ప్రాధాన్యత ఆధారంగా కేటాయిస్తుంది. కంప్లయన్స్, లీగల్, సెక్యూరిటీ పనులు సమయం కంటే ముందుగా పూర్తి అయ్యేలా చూస్తుంది. మిగిలిన AI ఏజెంట్లు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేస్తాయి. స్నీడ్ సోలో ఫౌండర్ కావడంతో ఈ AI సపోర్ట్‌తో కాంప్లెక్స్ ఆపరేషన్స్ సులభంగా నడుపుతున్నాడు. పెద్ద స్టాఫ్ లేకుండానే కంపెనీ నిర్వహిస్తున్నాడు.

తన నిర్ణయాలను ప్రశ్నించే AI

Advertisement

స్నీడ్ తన AI ఏజెంట్లను బ్లైండ్‌గా అంగీకరించకుండా ట్రైన్ చేశాడు. ఏ పని అయినా ధృవీకరణ, వ్యూహాల్లో ఏమైనా బలహీనతలు ఉంటే చూపించాలని చెప్పాడు. తన థియరీలను టెస్ట్ చేయాలని, బ్లైండ్ స్పాట్స్ హైలైట్ చేయాలని ఆదేశించాడు. AIలు వర్చువల్ రౌండ్‌టేబుల్ మీటింగ్స్ నిర్వహిస్తాయి. డాక్యుమెంట్లు, ప్రపోజల్స్‌ను గ్రూప్‌గా రివ్యూ చేస్తాయి. ఇలా చేయడంతో కచ్చితత్వం, క్లారిటీ పెంచుతుంది. డిపార్ట్‌మెంట్ల మధ్య నాలెడ్జ్ గ్యాప్స్ తగ్గుతాయి. ప్రతి AI ఏజెంట్‌ను ట్రైన్ చేయడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది. బిజినెస్ ఫంక్షన్లకు అనుగుణంగా ప్రాంప్ట్స్, గైడ్‌లైన్స్ కస్టమైజ్ చేస్తాడు.

AI పరిమితులు

ఫలితాలు బాగున్నా AI పూర్తిస్థాయిలో మనుషుల సామర్థ్యాన్ని పూరించలేదని స్నీడ్ అంగీకరిస్తున్నాడు. లీగల్ AI డాక్యుమెంట్లు డ్రాఫ్ట్ చేస్తుంది, డేటా త్వరగా ప్రాసెస్ చేస్తుంది. కానీ ఫైనల్ లీగల్ అప్రూవల్ మనుషుల లాయర్ చేయాల్సిందే. కాంప్లెక్స్ నిర్ణయాలకు మనుషుల తీర్పు, బాధ్యత అవసరం. AI ఎఫిషియెన్సీ పెంచుతుంది కానీ బాధ్యతను తొలగించదు.

Advertisement

Also Read: ఆన్‌లైన్ గ్రాసరీ ఆర్డర్ చేసేవారు తస్మాత్ జాగ్రత్త.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

భవిష్యత్తులో హైబ్రిడ్ మోడల్

స్నీడ్ భవిష్యత్తులో హ్యూమన్ + AI హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్‌తో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. AI చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోజువారీ గైడెన్స్ ఇస్తుంది. రిపీటిటివ్ టాస్క్‌లు AI చేస్తాయి. మనుషులు స్ట్రాటజీ, కాంప్లెక్స్ డిసిషన్స్‌పై దృష్టి పెడతారు. ఈ విధానం ప్రొడక్టివిటీ పెంచి, శారీరక శ్రమ తగ్గిస్తుంది. ప్రస్తుతం స్నీడ్ కంపెనీలో హ్యూమన్ స్టాఫ్ హైర్ చేయాలనే ప్లాన్ లేదు. AIపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పును చూపిస్తోంది. AI ఆటోమేషన్ ట్రెడిషనల్ రోల్స్‌ను మారుస్తోంది. కొన్ని ఉద్యోగాలు మార్పు చెందవచ్చు, కొత్త స్కిల్స్ అవసరం కావచ్చు. స్నీడ్ మోడల్.. ఆపరేషన్స్‌ను ఎలా రీషేప్ చేయగలదో చూపిస్తోంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×