Foxsky 43 inch QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి విజువల్స్ , ఆడియో ఫీల్ కోరుకునే వారికి ప్రముఖ బ్రాండ్ ఫాక్స్ స్కై నుంచి మరో అద్భుతమైన ప్రొడక్ట్ వచ్చేసింది. అదే Foxsky 109 cm TV. కేవలం రూ..15,799 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ, లేటెస్ట్ టెక్నాలజీ , ‘సన్ వాయిస్’ ట్యూన్ చేసిన 30W 2.1 CH ఆడియో సిస్టమ్‌తో యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది మన లివింగ్ రూమ్‌కి ఒక ట్రెండీ లుక్‌ని తెచ్చే గాడ్జెట్. సామాన్యులకు కూడా ప్రీమియం క్వాలిటీ అందించాలనే.. లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్‌ప్లే , పిక్చర్ క్వాలిటీ:
ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని క్యూఎల్ఈడీ డిస్‌ప్లే. సాధారణ ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే.. క్యూఎల్ఈడీ టెక్నాలజీ వల్ల రంగులు చాలా స్పష్టంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. దీని పూర్తి HD రిజల్యూషన్ , నేటివ్ 60Hz రిఫ్రెష్ రేట్ కారణంగా సినిమాలు చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు పిక్చర్ చాలా స్మూత్‌గా వస్తుంది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మోడల్ టీవీ ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ అవుతోంది
చాలా మంది స్మార్ట్ టీవీల్లో సౌండ్ సరిగ్గా రాదనే కంప్లైంట్ ఉంటుంది. కానీ ఈ సమస్యను పరిష్కరిస్తూ ఫాక్స్ స్కై సంస్థ ‘సన్ వాయిస్’సహకారంతో దీనికి ప్రత్యేకంగా 2.1 ఛానెల్ ఆడియో సిస్టమ్‌ను అందించింది. ఇందులో.. వచ్చే 30W పవర్‌ఫుల్ సౌండ్ అవుట్‌పుట్ ఎలాంటి బాహ్య హోమ్ థియేటర్ అవసరం లేకుండానే చక్కటి సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది.
Also Read: ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!
ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీనిద్వారా.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్‌ని నేరుగా టీవీలోనే చూడొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం బిల్ట్-ఇన్ వై-ఫై, బ్లూటూత్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఎక్స్‌టర్నల్ సెట్-టాప్ బాక్సులు లేదా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేయడానికి తగిన హెచ్‌డిఎంఐ, యూఎస్‌బీ పోర్టులు ఇచ్చారు. దీని బ్లూటూత్ సపోర్ట్ కూడా చాలా అద్భుతంగా పని చేస్తుంది.
ఈ లేటెస్ట్ ఎడిషన్ స్మార్ట్ టీవీ అసలు ధర మార్కెట్లో రూ.29,990 వరకు ఉండగా.. ప్రత్యేక డిస్కౌంట్స్‌లో ఇది కేవలం రూ. 15,799 ప్రారంభ ధరకే.. లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో క్యూఎల్ఈడీ పిక్చర్ క్వాలిటీ కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
మీ బడ్జెట్ రూ. 15 వేలు ఉండి, మంచి బ్రాండ్, ఎక్కువ ఫీచర్లు ఉన్న పెద్ద స్క్రీన్ టీవీ కొనాలని చూస్తున్నట్లయితే.. నిస్సందేహంగా ఈ మోడల్ కొనొచ్చు. ధర పరంగానూ, ఫీచర్ల పరంగానూ.. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.