East Godavari Accident: అతి వేగం ప్రమాదకరం. పోలీసులు వార్నింగ్, హెచ్చరిక బోర్డులున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేగంగా వచ్చిన కారు.. కొబ్బరి చెట్టుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని అన్నదమ్ములు స్పాట్‌లో మృతి చెందారు. ఇద్దరు తోడికోడళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఘటన ఎలా జరిగింది?
తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం లక్కవరం శివారులో కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఓఎన్జీసీ సైట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఆ గ్రామానికి చెందిన ముదునూరి రాంబాబు రాజు, సోదరుడు వెంకట సుబ్బరాజులు రొయ్యలు వ్యాపారం చేస్తారు. అన్నదమ్ములు ఇద్దరు భార్యలతో కలసి బంధువుల ఇంటికి భీమవరం వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. అయితే లక్కవరం ఓఎన్జీసీ సైట్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కొబ్బరి చెట్టును బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో రామభద్రరాజు, వెంకట సుబ్బరాజు స్పాట్‌లో మృతి చెందారు. తోడికోడళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే గ్రామస్థులు అక్కడికి చేరుకన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు కోలుకుంటున్నారు. రామభద్రరాజుకు ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. తమ్ముడు వెంకట సుబ్బరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేవలం రెండు నిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ALSO READ: తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం