E-Paper
Advertisement

BSNL Free Offer: BSNL సంచలన నిర్ణయం.. దేశ వ్యాప్తంగా ఫ్రీ ఆఫర్!

BSNL Free Offer: BSNL సంచలన నిర్ణయం.. దేశ వ్యాప్తంగా ఫ్రీ ఆఫర్!
Advertisement

Free BSNL 4G SIM Card: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL.. ప్రైవేట్ కంపెనీలకు దీటుగా అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4జీ సేవలను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. పాత నెట్‌వర్క్ నుంచి 4జీకి మారే వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు తెలిపింది. కొత్త నెట్ వర్క్ లోకి వచ్చే కస్టమర్లు ఇకపై వేగవంతమైన ఇంటర్నెట్, మెరుగైన కాల్ క్వాలిటీ, సున్నితమైన మొబైల్ అనుభవాన్ని అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ దేశ వ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులను అందించడం ప్రారంభించింది.

ప్రైవేట్ కంపెనీకలు పోటీగా..

BSNL ఇప్పటికే చౌకైన ప్లాన్స్, విస్తృతమైన నెట్ వర్క్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు గట్టి సవాల్ విసురుతోంది. ఇప్పుడు జియో, ఎయిర్‌ టెల్, విఐ లాంటి ప్రైవేట్ సంస్థలు BSNL ప్లాన్స్ తో షాకవ్వుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ 4జీ సిమ్ కార్లుతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయంతో తన కస్టమర్ బేస్‌ను మళ్లీ బిల్డ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రైవేట్ కంపెనీలు 5జీ నెట్ వర్క్ ను విస్తరిస్తున్నా..    

Advertisement

ప్రైవేట్ కంపెనీలు తమ 5G నెట్‌ వర్క్‌ ను విస్తరించడంలో బిజీగా ఉన్నప్పటికీ, BSNL లక్షలాది మందికి నమ్మకమైన 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఇప్పటికీ పరిమితంగా ఉన్న ప్రాంతాలలో హై స్పీడ్ నెట్ సౌకర్యం అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు మెరుగైన టెలికాం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

దేశ వ్యాప్తంగా ప్రతి మూలకు 4జీ కనెక్టివిటీ! 

BSNL ఉచిత 4జీ సిమ్ నిర్ణయం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో టెలికాం సేవలను మరింత మెరుగు పరచాలని భావిస్తోంది. చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తక్కువ వేగం, తరచుగా కాల్ డ్రాప్‌లతో ఇబ్బంది పడుతున్న పాత నెట్‌వర్క్‌ మీద ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 4జీ ఆధారిత నెట్‌ వర్క్‌ వైపు కస్టమర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నిర్ణయం ద్వారా BSNL స్థిరమైన కనెక్టివిటీని, మెరుగైన పనితీరును అందించాలని కోరుకుంటుంది. ఇప్పటికే ఉచితంగా 4జీ సిమ్ కార్డుల పంపిణీ ప్రారంభం అయ్యింది. త్వరలో దేశ వ్యాప్తంగా కొత్త సిమ్ లను అందించనున్నట్లు తెలిపింది.

ఉచితంగా 4జీ సిమ్ ఎలా తీసుకోవాలంటే?   

Advertisement

పాత నెట్‌వర్క్‌ నుంచి అప్‌గ్రేడ్ చేయాలనుకునే కొత్త వినియోగదారులు, ఇప్పటికే ఉన్న BSNL కస్టమర్లు ఇద్దరూ ఉచిత 4G సిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

⦿ ముందుగా దగ్గరలోని BSNL ఆఫీస్ కు వెళ్లాలి.
⦿ ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకెళ్లాలి.

⦿ టెలింకాం అధికారులు మీ వివరాలు కన్ఫార్మ్ చేస్తారు.

⦿ ధృవీకరణ పూర్తయిన తర్వాత, సిమ్ కార్డు ఉచితంగా అందిస్తారు.

⦿ కొద్ది సేపట్లోనే యాక్టివేట్ అవుతుంది.
⦿ BSNL అందించిన యాక్టివేషన్ సూచనలను ఫాలోకావాలి.

ఈ సిమ్ తీసుకున్న తర్వాత మంచి నెట్‌ వర్క్ క్వాలిటీ, హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను పొందే అవకాశం ఉంది.

Read Also:  కేబుల్ లేకుండా సులభంగా ఇంట్లోనే ప్రింటింగ్, స్కానింగ్.. వైఫై ప్రింటర్స్‌పై బిగ్ డిస్కౌంట్స్

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×