Podarillu Today Episode January 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. హారిక మహాను తీసుకొని బయటికి వస్తుంది.. నువ్వు చేసిందో తప్పు రైటో తెలీదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు మహా నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా అని హారిక మహాకూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది.. మహా మాత్రం నేనే తప్పు చేయలేదు వదిన నువ్వే నా గురించి తెలుసుకొని ఆ తర్వాత బాధపడతావు అని చెప్తుంది.. ఇప్పుడు అది మాట్లాడే టైం కాదు.. కానీ వదిన నేను మా నాన్నతో మాట్లాడాలి మా నాన్నను చూడాలి ఎలాగైనా సరే నాకు ఏర్పాటు చేయవని అంటుంది. అయితే హారిక నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నువ్వు అప్పటివరకు బయట ఉండు అని అంటే… నేను హాస్పిటల్ బయట కూర్చుంటాను వదిన నువ్వు నాకు మా నాన్నను కలిసేలా చెయ్యు అని అంటుంది.. బయట ఉంటే ఆది వస్తాడు పెద్ద గొడవ చేస్తాడు.. నువ్వు మా ఇంటికి వెళ్ళు మా అమ్మ నాన్నలకి నేను ఫోన్ చేసి చెప్తాను అని హారిక అంటుంది..నేను వదిన చెప్పిందని ఇక్కడికి వచ్చాను అంకుల్ అని మహా అంటుంది. అయితే అతను చక్రిన్ చూసి ఇతను కూడా ఇక్కడే ఉంటాడా ఇతను ఉండడానికి వీల్లేదు అని అంటాడు.. చక్రిని బయటకు వెళ్ళమని చెప్తుంది.. ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటే చక్రిని వెళ్లిపొమ్మని చెప్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మాధవ్ చక్రి కి ఫోన్ చేసి ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు.. నువ్వు మహాలక్ష్మితో కలిసే రావాలి.. వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారని మాధవ్ చక్రితో అంటాడు.. ఎలాగైనా సరే మహాను తీసుకొని రావాలి అని అనుకుంటారు.. చక్రి మహా కోసం బయట వెయిట్ చేస్తూనే ఉంటాడు.. ఫుడ్డు తినిందో లేదో అని కనుక్కోవాలని చక్రి అనుకుంటాడు.. మాధవ్ ఫోన్ చేసి చక్రిని మహని తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడు.. ఏం జరుగుతుందో అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే మహా ఏం చేస్తుందో అని చక్రి బాధపడుతూ తనకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు..
ఉదయం లేవగానే నారాయణ ఇచ్చిన సలహాని కేశవ కన్నా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. ఈ సలహా ఇచ్చింది నిజంగానే ఆయనేనా అని కన్నా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు.. నాక్కూడా అదే అనుమానం వచ్చింది రా ఎప్పుడు తాగి పడిపోయే ఆయన ఇలాంటి సలహాలు ఇవ్వడం ఏంటో అని ఆలోచిస్తున్నానని కేశవ అంటాడు.. ఇదంతా కాదు ఈ రిసెప్షన్ ని మనం ఎప్పుడు ఏర్పాటు చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు.. అప్పుడే నారాయణ వచ్చి వచ్చే ఏడాది చేస్తే బాగుంటుందేమో అని అంటాడు. ఆ ప్రేమ పిపాసి ఎప్పుడొస్తాడు అని అడుగుతాడు. చక్రి ఇవాళ సాయంత్రం రావచ్చు నాన్న అని మాధవ్ అంటాడు.. అయితే ఇవాళ ఏర్పాటు చేద్దాం అందరికీ కొట్టొచ్చినట్లు తెలుస్తుంది కదా అని నారాయణ అంటాడు..
అందరూ కూడా గ్రాండ్ గా రిసెప్షన్ ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తారు.. ఇలా చేస్తే తప్ప మన గురించి ఇంకొకరు తప్పుగా మాట్లాడారు అని నారాయణ అంటాడు.. సాయంత్రం రిసెప్షన్ కి ఏమేం కావాలన్న ఏర్పాట్లను చూసుకుంటారు.. మహా తన తండ్రి గురించి బాధపడుతూ ఉంటుంది.. ఇక వాళ్ళ అమ్మ నువ్వు ఇక్కడ ఉండడం మాకు ఏమీ ఇబ్బంది లేదమ్మా… అయితే అల్లుడు గారికి తెలిస్తే ఏదైనా సమస్య వస్తుందని ఎంత చెప్తున్నా సరే హారిక మాత్రం వినడం లేదు అని అంటారు.. నేను ఇక్కడేమీ ఉండనులేని ఆంటీ మీరేం బాధపడకండి మా నాన్నను చూసి నేను వెళ్ళిపోతాను అని మహా అంటుంది..
మీ నాన్నని చూడడానికి వెళ్తున్నావా మీ అంకులు ఇప్పుడు మీ నాన్నని చూడడానికి వెళ్ళాడు.. నీ పేరు ఎత్తగానే మీ నాన్న కోప్పడ్డాడంట.. పేరు వినడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు అలాంటిది నువ్వు అక్కడికి వెళ్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని అంటుంది.. అప్పుడే ఆదివాళ్ళ మామ ఇంట్లోకి వస్తాడు.. నన్ను డ్రాప్ చేయడానికి అల్లుడుగారు వచ్చారు అని అనగానే ఆదిని చూసి మహా షాక్ అవుతుంది.. మా ఇంట్లో నుంచి తరిమేసామని ఇక్కడికి వచ్చిందా? మీరు ఇక్కడ ఎందుకు ఉంచారు అని ఆది అడుగుతాడు.. నేను నాన్నను చూడండి ఇక్కడ నుంచి వెళ్ళను అని మహా మొండిగా మాట్లాడుతుంది..
అయితే నాన్నతో మాట్లాడాలా ఒకసారి మాట్లాడు ఏమంటాడో చూద్దామని ఆది ఫోన్ చేసి ఇస్తాడు.. ప్రతాప్ నా కూతురే లేదు చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళతో నేనెలా మాట్లాడుతాను ఇంకొకసారి ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దు అని ఆదికి చెప్తాడు.. మా నాన్నని ఎలాగైనా చూస్తాను అని మహా మొండిగా ప్రవర్తిస్తుంది.. నువ్వు ఇక్కడే కాదు ఈ ఊర్లోనే ఉండకూడదు వెళ్లిపో అని ఆది మహాను తోసేస్తాడు. పడిపోతున్న మహాని చక్రి పట్టుకుంటాడు.. వీడు కూడా ఇక్కడే ఉన్నాడా? నిన్నేమైనా చేస్తామని వీడు ఇక్కడ నీకోసం కాపలా ఉన్నాడా అని ఆది చక్రిని తిడతాడు.
Also Read :ధీరజ్ కు షాకిచ్చిన ప్రేమ.. అమూల్యను తీసుకెళ్లిన శ్రీవల్లి.. విశ్వం నిజస్వరూపం తెలుస్తుందా..?
వెళ్ళిపోదాం పదండి అని చక్రి మహాను తీసుకొని వస్తాడు. అయితే ఆది మాత్రం ఇకనుంచి వెళ్ళిపో ఇంకొకసారి ఇక్కడికి రావద్దు అని అంటాడు. మాట వినగానే చక్రి సొంత చెల్లెల్ని వదిలేసి వెళ్లిపోండి అని అంటున్నారు మీరు ఏం మనుషులు అని అంటాడు. చక్రి ని కొట్టబోతాడు. ఆది వాళ్ళ మామ ఆపడంతో ఆగుతాడు.. ఇక మహా చక్రి ఇద్దరూ కూడా టిఫిన్ చేస్తారు.. నాన్న నేను చనిపోయానని అంటున్నాడు నాకు చాలా బాధగా ఉంది అని మహా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత హారిక కు ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుక్కుంటుంది మహా.. ఇప్పుడు అక్కడికొస్తే కచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని వెళ్ళిపోవాలని అనుకుంటుంది..చక్రీ మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మా ఇంటికి వచ్చేసేయండి అని అడుగుతాడు.. ఇక తర్వాత మాధవ్ కన్నా ఇద్దరు కూడా ఆ ఊర్లోని వాళ్ళందరినీ రిసెప్షన్ కి పిలుస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహా చక్రి ఇద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ను చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..