E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తన కూతురును కనిపెట్టిన కావ్య 

Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తన కూతురును కనిపెట్టిన కావ్య 
Advertisement

Brahmamudi serial today Episode:

గుడికి వెళ్లిన కావ్య అక్కడే తులసి ఒడిలో ఉన్న పాపను చూస్తుంది. పాప ఏడుపు ఆపేందుకు పాట పాడుతుంది. కావ్య పాటకు పాప ఏడుపు ఆపేస్తుంది. కావ్యను చూసి నవ్వుతుంది. దీంతో తులసి, కావ్యను మెచ్చుకుంటుంది. తాను ఎంత ఆడించినా పాప ఏడుపు ఆపలేదని కానీ మీ పాటకు పాప ఏడుపు ఆపేసిందని చెప్తుంది. అక్కడికి వచ్చిన కావ్యను చూసిన మినిస్టర్‌ ధర్మేంద్ర, రుద్రాణి షాక్‌ అవుతారు. కావ్య ఏమైనా దేవతా? అన్నావు కదా? ఇక్కడి వరకు ఎలా వచ్చింది అని మినిస్టర్‌ అడగ్గానే..  రుద్రాణి మాత్రం తను ఏదో అనుకోకుండా గుడికి  వచ్చి ఉండొచ్చు అంటుంది. అలా ఏం కాదు ఏదో శక్తే తనని తన బిడ్డ దగ్గరికి తీసుకొచ్చింది. ఆ కావ్యకు తన బిడ్డ మీదున్న ప్రేమ చాలా బలమైనది అంటాడు మినిస్టర్‌. ఇక తులసి మీ దగ్గర ఏదో మహిమ ఉంది కాబట్టే పాప ఏడుపు ఆపేసింది అంటుంది.

అయితే కావ్య మాత్రం నా దగ్గర ఏ మహిమ లేదు అదే ఉండుంటే నా బిడ్డ నా దగ్గరికి వచ్చేది అంటూ కావ్య ఏడుస్తుంది. ఎందుకు అలా ఏడుస్తున్నారు మీ బిడ్డకు ఏమైంది చెప్పండి హెల్త్‌ ప్రాబ్లమ్‌ అయితే చెప్పండి మాదే పెద్ద హాస్పిటల్‌ ఉంది ట్రీట్‌మెంట్‌ చేయిస్తాం అని తులసి చెప్పగానే.. అదేం కాదు.. కానీ ప్రాణాలకు తెగించి కడుపున మోసిన బిడ్డను తనివితీరా చూసుకోకముందే నా బిడ్డ నాకు దూరమైంది. పురిట్లోనే నా బిడ్డను మార్చి దూరం చేశారు.. అప్పటి నుంచి నా పాప కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను అని చెప్తుంది. కావ్య..

Advertisement

మీ లాంటి మంచివాళ్లకే దేవుడు ఇలా చేస్తాడండి..ఏది ఏమైనా ఒక తల్లిని, బిడ్డను దూరం చేసినవారు మట్టి కొట్టుకుపోతారు. మా వారు మినిస్టర్… మీ గురించి మా వారికి చెబితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారు అంటూ తులసి చెప్తూనే ధర్మేంద్ర దగ్గరకు వెళ్లి ఈవిడకి పుట్టిన పాపని ఎవరో మార్చేశారు? వీళ్ల పాపని ఎత్తుకెళ్లి ఇంకో పాపని వీళ్ల దగ్గర పెట్టారట ఈవిడకు మీరే హెల్ఫ్‌ చేయాలి అని  తులసి చెప్పడంతో ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఈ అమ్మాయి తన కన్నబిడ్డ కోసం ఎంతో కుమిలిపోతోంది.. బిడ్డ జాడ కోసం ఎంతో వెతుకుతోంది, మీరు ఈ అమ్మాయికి సాయం చేయాలని చెబుతుంది తులసి. దీంతో ధర్మేంద్ర నేనేం చేయగలను అంటాడు. మీరు మినిస్టర్ కదా? ఆవిడ బిడ్డను దూరం చేసిన ఆ నీచుల్ని పట్టుకుని తన బిడ్డను తనకు అప్పగించి ఆ దుర్మార్గులకు శిక్షపడేలా చేయమంటుంది తులిసి.

దీంతో ధర్మేంద్ర కోపంగా ఇరిటేటింగ్‌ గా తులసి తిడుతూ.. మనం గుడికి ఎందుకు వచ్చాం.. ఏం చేస్తున్నాం.. వెళ్దాం పదా అని కోప్పడతాడు. నీతో మా పీఏ మాట్లాడతాడు.. వివరాలన్నీ అతనితో చెప్పండి.. ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటూ ధర్మేంద్ర, తులసిని తీసుకుని వెళ్లబోతుంటే.. తులసి చీరకు పసుపు, కుంకుమ అంటాయని కావ్య చెప్తుంది. దీంతో తులసి బిడ్డను కావ్యకు ఇచ్చి పసుపు కుంకుమ క్లీన్‌ చేసుకుంటుంది. బిడ్డ స్పర్శ తగలగానే కావ్యకు గూస్‌బంప్స్‌ వస్తాయి. కావ్య ఆ పాపే తన బిడ్డని అనుమానపడుతుంది. ఇంతలో ధర్మేంద్ర పాపను బలవంతంగా లాక్కున్ని తులసిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు రాజ్‌కు దగ్గరయ్యేందుకు రేఖ ప్రయత్నిస్తుంది. అందుకోసం కావ్య మీద లేనిపోని కట్టుకథలు చెప్తూ రాజ్‌ను రెచ్చగొడుతుంది. ఇంతలో రుద్రాణి ఫోన్‌ చేసి కావ్య గుడిలో పిచ్చిదానిలా ప్రవర్తించిందని అది ఇంట్లో వాళ్లందరికీ చెప్పు నేను వీడియో పంపిస్తాను చూపించు అని చెప్తుంది. రేఖ సరే అంటుంది. మరోవైపు డాక్టర్‌ లిస్ట్‌ తయారు చేసి కావ్యకు ఫోన్‌ చేస్తుంది. గుడిలో ఉన్న కావ్య నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను కలుస్తుంది. డాక్టర్‌ ఇచ్చిన రిపోర్ట్‌ చూసి మినిస్టర్‌ ధర్మేంద్ర దగ్గర ఉన్న బిడ్డే తన బిడ్డ అని కన్ఫ్‌ చేసుకుంటుంది. అందుకోసం ముందు డాక్టర్‌ చక్రవర్తిని కలవాలని అందుకోసం డాక్టర్‌ అనురాధను హెల్ప్‌ చేయమని అడుగుతుంది కావ్య. డాక్టర్‌ సరే అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×