E-Paper
Advertisement

Rain: కప్పలు అరిస్తే నిజంగానే వర్షం పడుతుందా? దీని వెనుకున్న సైన్స్ ఇదే!

Rain: కప్పలు అరిస్తే నిజంగానే వర్షం పడుతుందా? దీని వెనుకున్న సైన్స్ ఇదే!
Advertisement

Rain: చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు ‘ఒరేయ్.. కప్పలు అరుస్తున్నాయి.. రేపో ఎల్లుండో వర్షం గ్యారెంటీ’ అని చెప్పేవారు. అప్పట్లో అది కేవలం ఒక నమ్మకం అని అనుకునేవాళ్లం. కానీ, నిజానికి దాని వెనుక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పడానికి కప్పల అరుపులే ఒక గొప్ప ఉదాహరణ. నిజం చెప్పాలంటే కప్పలు ఒక రకమైన ‘నేచురల్ వెదర్ స్టేషన్లు’ లాంటివి.

కప్పల అరుపుల వెనుక శాస్త్రం..

Advertisement

సైన్స్ పరంగా చూస్తే.. కప్పలు ఉభయచర జీవులు (Amphibians). వీటి చర్మం చాలా సున్నితంగా, తేమగా ఉంటుంది. మానవ శరీరం గుర్తించలేని వాతావరణ మార్పులను కూడా కప్పల చర్మం ఇట్టే పసిగట్టగలదు. వర్షం పడటానికి ముందు వాతావరణంలో తేమ (Humidity) విపరీతంగా పెరుగుతుంది. గాలి పీడనంలో (Barometric Pressure) మార్పులు వస్తాయి. ఈ మార్పులు కప్పలకు ఒక రకమైన శారీరక ఉత్సాహాన్నిస్తాయి. అందుకే వర్షం పడబోయే ముందు ఆ తేమను ఆస్వాదిస్తూ అవి బయటకు వచ్చి అరుస్తుంటాయి.

వర్షాకాలంలో కప్పల ప్రేమ గీతాలు..

Advertisement

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అరుపులు కేవలం వాతావరణం బాగుందని చేసేవి కావు. వర్షాకాలం కప్పలకు సంతానోత్పత్తి సమయం (Breeding Season). మగ కప్పలు ఆడ కప్పలను ఆకర్షించడానికి గొంతు చించుకుని అరుస్తాయి. వీటిని ‘మేటింగ్ కాల్స్’ అంటారు. వర్షం పడితే గుంటలు, చెరువులు నిండుతాయి కాబట్టి, తాము పెట్టే గుడ్లు , పుట్టబోయే పిల్ల కప్పలు (టాడ్‌పోల్స్) సురక్షితంగా పెరుగుతాయని వాటికి తెలుసు. అందుకే వాన సూచన అందగానే.. రాబోయే అనుకూల పరిస్థితులను ఉపయోగించుకోవడానికి అవి సిద్ధమవుతాయి.

నిజమైన శాస్త్రం ఇదే..

కప్పలు అరిస్తే వర్షం రాదు, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టే కప్పలు అరుస్తాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన సైన్స్. పూర్వం వాతావరణ శాఖ రిపోర్టులు, మొబైల్ యాప్‌లు లేని కాలంలో మన పెద్దలు ఇలాంటి ప్రకృతి సంకేతాలను బట్టే వ్యవసాయ పనులు మొదలుపెట్టేవారు. గాలిలో తేమను బట్టి, పక్షుల కదలికలను బట్టి, కప్పల అరుపులను బట్టి వాన ఎప్పుడు వస్తుందో ఇట్టే చెప్పగలిగేవారు.

అదొక వెదర్ అలెర్ట్ లాంటిది..

నేటి టెక్నాలజీ యుగంలో మనం వీటన్నింటినీ మర్చిపోతున్నాం. కానీ, నేటికీ అడవుల్లో , గ్రామాల్లో కప్పల అరుపులే రాబోయే వానకు మొదటి సమాచారం. ప్రకృతిలో ప్రతి జీవికి పర్యావరణంతో ఒక విడదీయలేని బంధం ఉంటుంది. కప్పల అరుపులు వినిపిస్తే అది కేవలం శబ్దం కాదు, ప్రకృతి మనకు పంపిస్తున్న ఒక వెదర్ అలర్ట్. కాబట్టి ఇకపై మీకు కప్పల బెకబెకలు వినిపిస్తే, గొడుగు సిద్ధం చేసుకోవడం మర్చిపోకండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×