E-Paper
Advertisement

2025 Expensive Phones: ఈ సంవత్సరం లాంచ్ అయిన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు.. జాబితాలో టాప్ ఎవరంటే

2025 Expensive Phones: ఈ సంవత్సరం లాంచ్ అయిన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు.. జాబితాలో టాప్ ఎవరంటే
Advertisement

2025 Expensive Phones Launched | 2025 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కొత్త ఫోన్ల లాంచ్ లతో చాలా ఆసక్తికరంగా సాగింది. ఆపిల్, శామ్‌సంగ్, గూగుల్, ఓప్పో, వివో లాంటి కంపెనీలు పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు విడుదల చేశాయి. ఈ ఫోన్‌లు అత్యాధునిక ప్రాసెసర్స్, అద్భుతమైన కెమెరాలు, AI ఫీచర్స్‌తో వచ్చాయి. టెక్ లవర్స్ ఈ ఖరీదైన ఫోన్ల గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు. ఇవి ప్రీమియం హార్డ్‌వేర్, భవిష్యత్ సాఫ్ట్‌వేర్ తో లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. 2025లో విడుదలైన టాప్ 5 ఖరీదైన ఫోన్‌ల లిస్ట్ మీ కోసం.

1. ఒప్పో ఫైండ్ X9 ప్రో – Oppo Find X9 Pro (రూ.1,09,999)

ఒప్పో ఫైండ్ X9 ప్రో చాలా ప్రీమియం ఫోన్. ఇందులో 6.78 అంగుళాల LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz ఉండడంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తో పాటు గ్రాఫిక్స్ కోసం ARM G1- అల్ట్రా జిపియు ఉంది. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అద్భుతం. ఈ ఫోన్ ఫోటోగ్రఫీ లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్లలో ఒకటి.

2. వివో X300 ప్రో – Vivo X300 Pro (రూ.1,09,999)

Advertisement

వివో X300 ప్రో కూడా Oppo ఫైన్ ఎక్స్9 ప్రో తో సమానమైన ధరలో ఉంది. ఇందులో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధానంగా 200MP కెమెరా. డైమెన్సిటీ 9500 SoC (3nm టెక్నాలజీ) ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పని చేస్తుంది. వివో 5 సంవత్సరాల అప్‌డేట్స్ ఇస్తుంది. 6510mAh పెద్ద బ్యాటరీ + 90W వైర్డ్ ఛార్జింగ్ + 40W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. రోజంతా వాడినా ఛార్జ్ ఆఫ్ కాదు.

3. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా – Samsung Galaxy S25 Ultra (రూ.1,29,999)

జాబితాలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మరింత ఖరీదైనది. ఫోన్‌లో 6.9 అంగుళాల డైనమిక్ ఆమోలెడ్ 2X డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, 2600 నిట్స్ బ్రైట్‌నెస్. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. వెనుకవైపు నాలుగు కెమెరాలు.. 200MP ప్రధాన కెమెరా OISతో వస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ సూపర్ ఫాస్ట్.

4. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ – iPhone 17 Pro Max (రూ.1,49,900)

Advertisement

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ చాలా ఖరీదైన ఐఫోన్. 2025లో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ లో అత్యంత పెద్ద మోడల్. ఈ లేటెస్ట్ ఐఫోన్ లో 6.9 అంగుళాల సూపర్ రెటీనా XDR ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్ లో పవర్‌ఫుల్ A19 Pro చిప్ (3nm) ఉంది. మూడు వెనుక కెమెరాలు.. అన్నీ 48MP (మెయిన్, టెలిఫోటో, అల్ట్రావైడ్). వీడియో, ఫోటోలు అద్భుతంగా వస్తాయి. iOSతో వస్తుంది.. లేటెస్ట్ కాబట్టి చాలా సంవత్సరాలపాటు అప్‌డేట్స్ వస్తాయి.

5. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్.. Google Pixel 10 Pro Fold – (రూ.1,79,999)

2025లో అతి ఖరీదైన టాప్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. ఈ ఫోన్ లో 8 అంగుళాల భారీ ఫోల్డబుల్ LTPO ఓలె్ ప్యానెల్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. కవర్ డిస్‌ప్లే 6.4 అంగుళాలు. ఇందులో లేటెస్ట్ గూగుల్ టెన్సర్ Tensor G5 ప్రాసెసర్ ఉంది. Android 16తో ఆధారంగా పనిచేస్తుంది. 7 మేజర్ అప్‌గ్రేడ్స్ ఇస్తారు. ఫోల్డబుల్ డిజైన్ వల్ల పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది.

2025లో ఈ ఫోన్‌లు మార్కెట్‌ని షేక్ చేశాయిజ అన్నీ ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన ఫోన్లు. మీ బడ్జెట్, అవసరాలు బట్టి ఎంచుకోండి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×