E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ కు క్లాస్ పీకిన శ్రీయ.. రాజేశ్వరికి షాకిచ్చిన అక్షయ్.. అవని పై పల్లవి కక్ష్య..?

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ కు క్లాస్ పీకిన శ్రీయ.. రాజేశ్వరికి షాకిచ్చిన అక్షయ్.. అవని పై పల్లవి కక్ష్య..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి చక్రధర్ని కలిసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. రాజేశ్వరిని నమ్మించేందుకు చక్రధర్ ప్రయత్నం చేసి మొత్తానికి రాజేశ్వరుని నమ్మించేస్తాడు.. నిజమేనని నమ్మిన రాజేశ్వరి తన భర్తని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలని తన పుట్టింటికి వెళ్తుంది.. ఈశ్వర్ ని కలవడానికి రాజేంద్రప్రసాద్ వెళ్లేందుకు సిద్ధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి రాజేశ్వరి రావడంతో షాక్ అవుతారు.. మనమే వెళ్దామని అనుకుంటే రాజేశ్వరిని వస్తుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. తన పుట్టింటి వాళ్ళని చూడగానే రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అందరితో బాధపడుతూ మాట్లాడుతుంది. అందరూ మీరు ఇలా అయిపోతారని అస్సలు అనుకోలేదు అని అంటారు.. ఆ భర్తని జైల్లో చూసి నేను ఇలా మారిపోవాల్సి వచ్చింది అని రాజేశ్వరి అంటుంది. నా భర్త ఇప్పుడు పూర్తిగా మారిపోయారు నా భర్తని మీరు బయటకు తీసుకురండి అని వేడుకుంటుంది.. మీ గురించి ఒకప్పుడు ఎన్నో కుట్రలు చేశాడు నేను మీకు ఆయన చేసిన కుట్రల గురించి బయట పెట్టి సహాయం చేశాను.. అ క్కడ ఉన్నది నా భర్త అని కూడా చూడకుండా మీకు ఎన్నో సార్లు సహాయం చేసిన విషయం మీకు గుర్తుందా అని రాజేశ్వరి అడుగుతుంది.. జైలుకు వెళ్లి ఆయన చూసి వచ్చాను ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు.. నాకు మీరందరూ పతిభిక్ష పెట్టండి అని వేడుకుంటుంది.. నువ్వు మమ్మల్ని అలా అడగడం ఏంటి అని భానుమతి అంటుంది. మీరు ఆవేశంగా బాధపడుతున్నారు పిన్ని గారు మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అని అవని అంటుంది. నాకు మీ మర్యాదల అవసరం లేదు నా భర్తని బయటకు తీసుకురండి అని రాజేశ్వరి వేడుకుంటుంది.. అన్నయ్య నీ చెల్లెలు పసుపు కుంకుమలను నువ్వు కాపాడతావో.. లేక నువ్వే నీ చేతులతో నీ చెల్లెలు సింధూర నీ చెడిపేస్తావో నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా రాజేశ్వరి చెప్పిన విషయాన్ని ఆలోచించాలని అనుకుంటారు.. నా ఒక్కరి అభిప్రాయం మాత్రమే కాదు కదా ఇంట్లోని వాళ్ళ అందరి అభిప్రాయాన్ని కనుక్కోవాలి కదా అని రాజేంద్రప్రసాద్ అందరినీ అడగాలని అనుకుంటాడు.. అందరూ కూడా చక్రధర్ ను బయటకు తీసుకురావడానికి ఒప్పుకోరు.. వాడిలాంటి దుర్మార్గుడు మళ్లీ బయటకు వస్తే మళ్లీ మనం సమస్యల్లో పడాలి అని అనుకుంటారు.. ముందుగా శ్రీకర్ని అడిగితే శ్రీకర్ అదే సమాధానం చెప్తాడు. అలాగే కమల్ కూడా చక్రధర్ పేరు వినగానే ఆవేశంతో రగిలిపోతాడు.. వాడి లాంటి దుర్మార్గుడ్ని బయటికి తీసుకొస్తే మనల్ని చంపేస్తాడు అని కమల్ అంటాడు. ఇక ఆ తర్వాత అవన్నీ కూడా అదే సమాధానం చెప్పడంతో భానుమతి అవని పై సీరియస్ అవుతుంది.

శ్రీకర్ని శ్రియ నువ్వు ఇంట్లోని వాళ్ల గురించి ఆలోచించడం ఎందుకు నీకు ఒక భార్యగా నేను అన్ని చెప్తున్నాను కదా.. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటుంది. మీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచిస్తే మీ అత్తయ్య మామయ్యకు వ్యతిరేకి అవుతావు. నువ్వు ఎవరి విషయాలను తల దూర్చొద్దు అని శ్రియ శ్రీకర్ తో అంటుంది.. కానీ శ్రీకర్ మాత్రం నేను ఒక లాయర్ ని.. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకపోతే చేతకాని వాడిని అని అనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని శ్రీకర్ అంటాడు. ఆ మాట వినగానే శ్రియా షాక్ అవుతుంది.

Advertisement

రాజేశ్వరి ఇంట్లోకి రాగానే భానుమతి రాజేశ్వరి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నా అని అంటుంది. ఏంటమ్మా ఏమైంది అందరూ ఆయన్ని జైలు నుంచి తీసుకురావడానికి ఒప్పుకున్నారా అని అడుగుతుంది. అయితే రాజేంద్ర పార్వతి అయితే ఒప్పుకున్నారు. మిగిలిన వాళ్ళు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడట్లేదు అని రాజేశ్వరి కి భానుమతి చెప్తుంది.. రాజేశ్వరి చాలా సంతోషంగా నా భర్తను విడిపించడానికి మీరందరూ ఒప్పుకున్నారా పదండి వెళ్ళిపోదాం పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసును వెనక్కి తీసుకుందామని అడుగుతుంది.. చక్రధర్ ని విడిపించడానికి ఏ ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు..

అక్షయ్ పద వెళ్దాం నువ్వే కదా కేసు పెట్టింది వెళ్లి మీ మామయ్యని విడిపించుకుని తీసుకొని వద్దాం పద అని అంటుంది.. కానీ అక్షయ్ మాత్రం నేను రాను అత్తయ్య అని అంటాడు.. అదేంట్రా అలా మాట్లాడుతున్నావ్.. నాకు పతి బిక్ష పెట్టమని అడిగాను వేడుకున్నాను మా ఆయనను తీసుకొని వద్దాం పదండి.. అని ఎంత బ్రతిమిలాడినా సరే అక్షయ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. నేను నీకు ఒక అత్త లాగా కాదు నీకు కన్న తల్లి కన్న ఎక్కువగా నేను పెంచాను. ఆ భర్తని నాకు కావాలని అడుగుతున్నాను నువ్వు ఏం మాట్లాడవ్ ఏంట్రా అని అక్షయ్ ని అడుగుతుంది. ఒకప్పుడు నా భర్త దుర్మార్గుడు భర్త అని కూడా చూడకుండా మీకు సాయం చేస్తాను.. అతనికి శిక్ష పడేలా చేస్తాను అని అన్నావు కదా అత్త అని అక్షయ్ అడుగుతాడు..

Also Read :మీనా మాట విన్న బాలు.. శృతికి పురిటీ నొప్పులు..రోహిణి ఇలా దొరికిపోయిందేంటి..?

ఇప్పుడు నువ్వు నీ స్వార్థం కోసం ఆలోచిస్తున్నావా అత్తయ్య అని అక్షయ్ అనగానే రాజేశ్వరి షాక్ అవుతుంది.. ఎంతగా రాజేశ్వరి నా భర్తను విడిపించండి అని వేడుకున్న సరే అక్షయ్ మాత్రం కరగడు.. అక్షయ్ బాటలోనే కమల్ కూడా నడుస్తాడు.. ఆ దుర్మార్గున్ని బయటకి తీసుకువచ్చే ఫసక్తే లేదు అని అంటాడు.. రాజేశ్వరి మీరందరూ నా ఉసురు పోసుకుంటారు.. ఆడబిడ్డ ఉసురు పోసుకునోళ్ళు ఏ ఒక్కరు బాగు పడినట్లు లేదు.. మీరందరూ నాశనం అయిపోతారు అని శాపాలు పెడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×