E-Paper
Advertisement

Fujifilm Instax Mini 13: ఫొటో తీస్తూనే తక్షణమే ప్రింటింగ్.. కేవలం రూ.10000కే అదిరిపోయే ఫీచర్స్‌తో ఇన్‌స్టంట్ కెమెరా

Fujifilm Instax Mini 13: ఫొటో తీస్తూనే తక్షణమే ప్రింటింగ్.. కేవలం రూ.10000కే అదిరిపోయే ఫీచర్స్‌తో ఇన్‌స్టంట్ కెమెరా
Advertisement

Fujifilm Instax Mini 13| ఫుజిఫిల్మ్ కంపెనీ భారత్‌లో కొత్త ఇన్‌స్టాక్స్ మినీ 13 ఇన్‌స్టంట్ కెమెరా విడుదల చేసింది. ఇది సరళమైన ఇన్‌స్టంట్ ఫోటోగ్రఫీ కోసం ఎంట్రీ-లెవల్ యూజర్లకు రూపొందించబడింది. ఫోటో తీసిన వెంటనే ప్రింట్ అవుతుంది. వినియోగించడంలో ఈజీ, స్టైలిష్ డిజైన్‌తో వస్తోంది.

ధర, లభ్యత

ఇన్‌స్టాక్స్ మినీ 13 ధర రూ.10,999 మాత్రమే. మార్చి 31, 2026 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. డ్రీమీ పర్పుల్, క్యాండీ పింక్, ఫ్రాస్ట్ బ్లూ, లగూన్ గ్రీన్, క్లే వైట్ అనే 5 ఆకర్షణీయ కలర్లలో వస్తోంది. అదే సమయంలో ఇన్‌స్టాక్స్ వైడ్ 400 కూడా జెట్ బ్లాక్ కలర్‌లో లాంచ్ అవుతోంది.

తక్షణ ప్రింటింగ్, ఉపయోగించడం సులభం

Advertisement

ఫోటో తీసిన వెంటనే ప్రింట్ అవుతుంది. వేరే ప్రింటర్ అవసరం లేదు. పాయింట్ అండ్ షూట్ మెకానిజం ఉంది. ఫోటోగ్రఫీ గురించి ఎక్కువ తెలియకపోయినా సులభంగా ఉపయోగించవచ్చు. లెన్స్‌ను తిప్పితే కెమెరా ఆన్ అవుతుంది. షట్టర్ బటన్ నొక్కితే ఫోటో తీసి ప్రింట్ అవుతుంది.

బిల్ట్-ఇన్ టైమర్లు

ఈ ఇన్‌స్టెంట్ మినీ కెమెరాలో రెండు టైమర్లు ఉన్నాయి. 2 సెకన్లు, 10 సెకన్లు. గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు తీసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. షేక్ లేకుండా స్థిరంగా ఫోటోలు వస్తాయి.

స్టైలిష్ డిజైన్, బిల్డ్

Advertisement

పాప్-స్టైల్ డిజైన్‌తో రౌండెడ్ 3D బాడీ ఉంది. ఆధునికంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు ప్యానెల్‌పై మెటాలిక్ సిల్వర్ లోగో ఉంది. కాంపాక్ట్‌గా, తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుంది. యాంగిల్ అడ్జస్ట్‌మెంట్ యాక్సెసరీ కూడా ఇస్తున్నారు. వివిధ యాంగిల్స్ నుంచి బెటర్ ఫ్రేమ్‌లు తీయవచ్చు.

Also Read: యూజర్ నిద్రపోతుండగా స్టాక్ ట్రేడింగ్ చేసిన ఏఐ.. ఒక్క రాత్రిలో రూ.29 లక్షల లాభం

స్మార్ట్ ఫీచర్లు

ఇందులో ఉన్న క్లోజ్-అప్ మోడ్.. డీటెయిల్డ్ షాట్స్ తీయడానికి సాయపడుతుంది. పారలాక్స్ కరెక్షన్ ఉండటంతో తక్కువ దూరంలో సరిగ్గా ఫ్రేమింగ్ అవుతుంది. ఆటోమాటిక్ ఎక్స్‌పోజర్ కంట్రోల్ ఉంది. లైటింగ్ ప్రకారం షట్టర్ స్పీడ్, ఫ్లాష్ అడ్జస్ట్ అవుతాయి. బేసిక్ AI ఫీచర్లు వివిధ ఎన్విరాన్‌మెంట్లలో ఇమేజ్ క్వాలిటీ మెరుగుపరుస్తాయి.

ఎవరికి బాగుంటుంది?

తక్కువ ధర, సులభంగా వినియోగం, తక్షణ ఫలితాలు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ కెమెరా ఆప్షన్. క్విక్ ప్రింటెడ్ మెమరీలు కావాలనుకునే బిగినర్లు, క్యాజువల్ యూజర్లకు అనువైనది. స్టైల్, ఈజ్ ఆఫ్ యూజ్, స్మార్ట్ ఫీచర్లతో ఎంట్రీ-లెవల్ ఇన్‌స్టంట్ కెమెరా మార్కెట్‌లో బలమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీలు ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. మీరు కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని సూచన. ఈ కథనంలో పేర్కొన్న ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ ధర, ఇతర విషయాలకు బాధ్యత వహించదు. ఈ వివరాలన్నీ కేవలం మీ అవగాహన కోసమే.

 

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×