E-Paper
Advertisement

Galaxy Forever: సగం ధరకే గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్, ఫ్రీ ఈఎంఐ కూడా.. అదిరిపోయే ప్రొగ్రామ్ లాంచ్ చేసిన శాంసంగ్

Galaxy Forever: సగం ధరకే గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్, ఫ్రీ ఈఎంఐ కూడా.. అదిరిపోయే ప్రొగ్రామ్ లాంచ్ చేసిన శాంసంగ్
Advertisement

Galaxy Forever| కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని పేరు గెలాక్సీ ఫారెవర్ (Galaxy Forever). ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రీమియం గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. పైగా పూర్తి ధర ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్పెషల్ ఆఫర్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.

ఇంటరెస్ట్-ఫ్రీ EMI, ప్రొటెక్షన్ ప్లాన్

ఈ ప్రోగ్రామ్‌లో 12 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంది. ఫోన్ ధరలో సుమారు 50 శాతం మాత్రమే 12 నెలల పాటు చెల్లించాలి. అదనంగా రూ.13999 విలువగల Samsung Care+ ప్రొటెక్షన్ ప్యాకేజీ ఉచితంగా వస్తుంది. ఏదైనా ప్రమాదం వల్ల డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ నుంచి మొదటి ఏడాది రక్షణ ఇస్తుంది.

Galaxy Forever ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఫోన్ ధరలో సగం (సుమారు 50 శాతం) 12 నెలల EMIలో కస్టమర్లు చెల్లించాలి. ఈఎంఐలపై వడ్డి కూడా ఉండదు. ఈ 12 నెలల కాలంలో Samsung Care+ కవరేజ్ ఆటోమాటిక్‌గా వస్తుంది. 12 నెలల తర్వాత మూడు ఆప్షన్లలలో ఒకటి ఎంచుకోవాలి. ఫోన్ అప్‌గ్రేడ్ చేయడం, ఫోన్ ఉంచుకోవడం, రిటర్న్ చేయడం.

ఉదాహరణ గెలాక్సీ S26 అల్ట్రా

ఇటీవలే లాంచ్ అయిన గెలాక్సీ S26 అల్ట్రా (12GB + 256GB) అధికారిక ధర రూ.1,39,999. ప్రోగ్రామ్‌లో అడ్వాన్స్ బయ్‌బ్యాక్ వాల్యూ రూ.69,999.50 ధరకు ఈఎంఐ ఆప్షన్‌లో లభిస్తుంది. దీంతో ఫైనల్ ధర రూ.69,999.50 అవుతుంది. నెలకు EMI సుమారు రూ.5,833 మాత్రమే. ప్రోగ్రామ్ ఫీజు రూ.749 కూడా జోడిస్తే.. నెలకు జోడిస్తే మొత్తం నెలవారీ చెల్లింపు రూ.6,583 అవుతుంది.

12 నెలల తర్వాత మూడు ఆప్షన్లు

Advertisement

అప్‌గ్రేడ్ ఆప్షన్.. 10వ నుంచి 13వ నెల మధ్య Samsung వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. అప్రూవ్ అయితే పాత లోన్ క్లోజ్ అవుతుంది. కొత్త Galaxy ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు కొత్త లోన్ తీసుకోవచ్చు.
రిటైన్ ఆప్షన్.. ఫోన్ మీ వద్దనే ఉంచుకోవాలనుకుంటే మిగిలిన బ్యాలెన్స్ ఒకేసారి చెల్లించాలి. చెల్లింపు పూర్తయ్యాక ఫోన్ పూర్తిగా మీదే అవుతుంది.
రిటర్న్ ఆప్షన్.. 12వ నుంచి 13వ నెల మధ్య రిటర్న్ రిక్వెస్ట్ చేయవచ్చు. ఫోన్ రిటర్న్ చేసి ప్రోగ్రామ్ నుంచి బయటపడవచ్చు.

ప్రోగ్రామ్‌లో చేరడం ఎలా?

శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ప్రొడక్ట్ పేజీకి వెళ్లి గెలాక్సీ ఫారెవర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు సాధారణ కొనుగోలు ప్రాసెస్ పూర్తి చేయాలి. ఒక సంవత్సరం తర్వాత అప్‌గ్రేడ్, రిటైన్ లేదా రిటర్న్ ఎంచుకోవచ్చు.

రిటర్న్ లేదా అప్‌గ్రేడ్ చేయడానికి షరతులు

ఫోన్ సరైన వర్కింగ్ కండిషన్‌లో ఉండాలి. హార్డ్‌వేర్‌ను ట్యాంపర్ చేయకూడదు. IMEI నంబర్ ద్వారా వెరిఫై చేస్తారు. బాక్స్‌లో వచ్చిన యాక్సెసరీలు (స్టైలస్ మొదలైనవి) తిరిగి ఇవ్వాలి. ఫోన్ ఛార్జ్‌లో ఉండాలి. డేటా బ్యాకప్ తీసుకుని, మెమరీ కార్డ్ తీసేసి ఇవ్వాలి.

Also Read: ఇండక్షన్ స్టవ్ కొనేముందు ఇవి చెక్ చేసుకోండి.. లేకపోతే కరెంట్ బిల్లు వాచిపోద్ది

భారత్‌లో మాత్రమే

గెలాక్సీ ఫారెవర్ ప్రోగ్రామ్ ప్రస్తుతం భారత్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. Galaxy S26 సిరీస్ ఫోన్లు కొనేవారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. Samsung అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌లో చేరవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫోన్లు సులభంగా, తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చాలా మంచి అవకాశం.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×