Galaxy Swan Plus: సామ్‌సంగ్ మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసే కొత్త మొబైల్‌ను సిద్ధం చేసింది అదే గెలాక్సీ స్వాన్ ప్లస్ 2025. ఈ ఫోన్ గురించి ప్రస్తుతం లీక్ అయిన వివరాలు చూస్తే, ఇది రాబోయే ఏడాది మార్కెట్‌ను కుదిపేసేలా ఉంది. ఫీచర్ల పరంగా ఇది ఇతర అన్ని ఫోన్లకు పెద్ద సవాల్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో ఉన్న ప్రతి అంశం ప్రత్యేకమే. కొత్తగా డిజైన్ చేసిన బాడీ, భారీ బ్యాటరీ, అత్యుత్తమ కెమెరా, సూపర్ పనితీరు ఇవన్నీ కలిపి గెలాక్సీ స్వాన్ ప్లస్‌ను 2025లో చూసే అత్యంత శక్తివంతమైన ఫోన్‌గా మార్చుతున్నాయి.
ప్రీమియం క్లాస్ లుక్
ముందుగా దీని డిజైన్ గురించే చెబుదాం. గెలాక్సీ స్వాన్ ప్లస్ 2025ను చేతిలో పట్టుకున్నప్పుడు అది ఒక ప్రీమియం క్లాస్ అనుభూతిని ఇస్తుంది. మెటల్ ఫ్రేమ్‌తో పాటు గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. స్క్రీన్ విషయంలో సామ్‌సంగ్ తన క్వాలిటీని మరోసారి నిరూపించింది. 6.8 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేలో వచ్చే ప్రతి రంగు కళ్లకు పండుగలా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వీడియోలు, గేమ్స్ అన్నీ అడేందుకు అనుకూలంగా ఉన్నాయి.
చిప్‌సెట్ ఏ ప్రాసెసర్‌కైనా సవాల్
ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పనితీరు గురించి. ఈ ఫోన్‌లో సామ్‌సంగ్ సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. ఈ చిప్‌సెట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏ ప్రాసెసర్‌కైనా సవాల్‌గా నిలుస్తుంది. దీని వల్ల ఫోన్ వేగం అమాంతం పెరిగిపోయింది. గేమ్స్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ అనే మాటే ఉండదు. యాప్‌లు స్విచ్ చేయడం, మల్టీటాస్కింగ్ అన్నీ సులుగా ఉపయోగించుకోవచ్చు.
18జిబి ర్యామ్- 256జిబి స్టోరేజ్
ర్యామ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మూడు వేరియంట్లలో వస్తుందని లీక్‌లు చెబుతున్నాయి. 12జిబి, 16జిబి, అలాగే 18జిబి ర్యామ్. స్టోరేజ్ విషయానికొస్తే 256జిబి నుంచి 1టిబి వరకు ఉంటుంది. అంతేకాదు, మైక్రో ఎస్‌డి స్లాట్‌తో అదనంగా 1టిబి వరకు విస్తరించుకోవచ్చు. అంటే ఫోటోలు, వీడియోలు, గేమ్స్ ఎంతైనా భద్ర పరచవచ్చు.
వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్‌ను ఫోటో లవర్స్, వీడియో క్రియేటర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో, అలాగే 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉంటాయని లీక్‌లు చెబుతున్నాయి. ప్రతి ఫోటో ప్రొఫెషనల్ స్థాయిలో క్వాలిటీతో వస్తుంది. రాత్రి సమయంలో కూడా నైట్ మోడ్ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రంట్‌లో మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు తీసేటప్పుడు కూడా ఒక డిఎస్ఎల్ఆర్ స్థాయి క్లారిటీ ఇస్తుంది. వీడియో కాల్స్ కూడా సూపర్ క్లియర్‌గా వస్తాయి.
Also Read: iPhone 16 Offers: ఐఫోన్ 16.. ఫ్లిప్ కార్టులో కొనాలా? అమెజాన్‌లోనా? ఎందులో ధర తక్కువో తెలుసా?
16,300 mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది నిజంగా గేమ్‌చేంజర్. గెలాక్సీ స్వాన్ ప్లస్2025 లో 16,300 mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీని సామ్‌సంగ్ ఉపయోగించింది. ఇది ఒకరోజు కాదు, రెండు రోజులు కూడా ఈజీగా పనిచేస్తుంది. అంతేకాదు, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ చార్జ్ అయిపోతుంది. ఈ ఫీచర్ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
థియేటర్ అనుభూతి
సౌండ్ విషయానికి వస్తే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. సినిమాలు లేదా పాటలు వినేటప్పుడు థియేటర్ అనుభూతి వస్తుంది. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఇది చాలా మంది వినియోగదారులకు సంతోషకరమైన విషయం. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా సెక్యూరిటీ పరంగా చక్కగా పనిచేస్తుంది.
ఏఐ ఫీచర్లు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. సామ్‌సంగ్ సొంత వన్ యూఐ ఇంటర్‌ఫేస్‌తో ఇది మరింత స్మూత్‌గా, ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్, ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ఫోన్ ఆటోమేటిక్‌గా యూజర్ వాడకం నేర్చుకుని, బ్యాటరీ సేవ్ చేయడానికి, యాప్‌లు వేగంగా ఓపెన్ అవ్వడానికి సహాయపడుతుంది.
మార్కెట్లో ఎప్పుడు వస్తుంది
గెలాక్సీ స్వాన్ ప్లస్ 2025 విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, లీక్‌ల ప్రకారం ఇది వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి రావచ్చు. ధర విషయానికి వస్తే, ఇది ఫ్లాగ్‌షిప్ కేటగిరీ ఫోన్ కావడంతో 80 వేల రూపాయల నుంచి ప్రారంభం అవుతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఫీచర్లు చూస్తే ఇది మార్కెట్లో ఉన్న ఏ బ్రాండ్‌కైనా సవాల్ విసరగలదు. శక్తివంతమైన బ్యాటరీ, అద్భుత కెమెరా, టాప్ క్లాస్ పనితీరు ఇవన్నీ కలిపి ఈ ఫోన్‌ను 2025లో సూపర్ హిట్‌గా నిలిపే అవకాశం ఉంది.