iPhone 16 Offers: దీపావళి సీజన్ వచ్చిందంటే మార్కెట్ అంతా ఆఫర్లతో కళకళలాడిపోతుంది. కానీ ఈ సారి అందరి దృష్టి మాత్రం ఒక్కదానిపైనే ఉంది ఐఫోన్. ఆపిల్ ఫోన్లంటే అందరికీ ఇష్టం కానీ ధరలు చూసి వెనక్కి తగ్గిపోతుంటారు. అయితే ఈ దీపావళి సేల్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ వినియోగదారుల కోసం పెద్దపెద్ద తగ్గింపులు ప్రకటించాయి. కానీ అసలు ప్రశ్న ఏ సైట్‌లో తక్కువ ధరకు ఐఫోన్ దొరుకుతుంది? ఫ్లిప్‌కార్ట్ లోనా? లేక ఫ్లిప్‌కార్ట్ లోనా?
ఫ్లిప్‌కార్ట్, బిగ్ బిలియన్ డేస్
ముందుగా ఫ్లిప్‌కార్ట్ వైపు చూద్దాం. బిగ్ బిలియన్ డేస్ పేరుతో వచ్చే సేల్‌లో ఈసారి ఐఫోన్ 16 (128GB) ని కేవలం రూ.51,999కి అందిస్తున్నారు. ఇది ఆఫీషియల్ లాంచ్ ధరతో పోలిస్తే చాలా తక్కువ. అదీ కాక ఎస్‌బిఐ కార్డ్ వాడితే 10శాతం అదనపు డిస్కౌంట్, పాత ఫోన్ ఇచ్చి ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. కొన్ని మోడల్స్‌పై రూ.50,000 వరకు తగ్గింపు కూడా చూపిస్తున్నారు. ఉదాహరణకు ఐఫోన్ 16 ప్రో పై ఉన్న భారీ తగ్గింపు చూస్తే ఫ్లిప్‌కార్ట్ సేల్ నిజంగా దుమ్ము దులిపేలా ఉంది.
అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
ఇప్పుడు అమెజాన్ వైపు వస్తే, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో పెద్దపెద్ద ఆఫర్లు తెచ్చింది. ఐఫోన్ 15 ని ఈసారి అమెజాన్ రూ.45,000 లోపల ధరకు అందిస్తోంది. దీనికి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా జతచేస్తే ధర మరింత తగ్గిపోతుంది. ప్రైమ్ సభ్యులైతే ముందుగానే ఆఫర్ యాక్సెస్ కూడా పొందొచ్చు. అలాగే అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్రో కూడా భారీ తగ్గింపుతో రూ57,000 వరకు వస్తోంది. అంటే ఫ్లిప్‌కార్ట్ లాగా ఇక్కడా తక్కువే కానీ కొన్ని మోడళ్లలో ఫ్లిప్‌కార్ట్ కంటే అమెజాన్ ముందుంది.
Also Read: Realme 15T 5G: రియల్‌మీ 15T 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్‌తో అదిరిపోయే ఫోన్!
ఇద్దరిలో ఎవరు బెస్ట్
ఇద్దరి మధ్య ధరలను పోలిస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఐఫోన్ 16 (128GB) ఫ్లిప్‌కార్ట్ లో రూ.51,999 అయితే అమెజాన్‌లో రూ.69,499 చూపిస్తున్నారు. కానీ ఐఫోన్ 15 విషయంలో అమెజాన్ కాస్త ముందుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,900 ఉండగా అమెజాన్‌లో రూ.59,900 కి లభిస్తోంది. అంటే ప్రతి మోడల్‌కు తగినట్టు ఏ సైట్‌లో తగ్గింపు ఎక్కువుందో చూసుకోవాలి.
డీల్స్‌లో ఎవరు పోటీ
అసలు ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎందుకు ఎక్కువ ఆకర్షణీయంగా అనిపిస్తుందంటే, అక్కడ వచ్చే బ్యాంక్ కార్డ్ బెనిఫిట్స్, ప్లస్ మెంబర్ రివార్డ్స్, కూపన్ డీల్స్ వంటివి ఎక్కువ. అదీ కాక డెలివరీ కూడా వేగంగా ఉంటుంది. కానీ అమెజాన్ మాత్రం “ప్రైమ్ డెలివరీ”, “బెటర్ రిటర్న్ పాలసీ” తో పోటీగా నిలుస్తుంది. ఇరువురూ వినియోగదారులను ఆకర్షించడానికి అన్ని మార్గాలూ ప్రయత్నిస్తున్నాయి.
ధరలు మారుతుంటాయి గమనించండి
దీపావళి రోజుల్లో ఒక్కో గంటకు ధరలు మారుతుంటాయి. అందుకే కొనాలని అనుకున్న మోడల్‌ను ముందుగానే విష్‌లిస్ట్‌లో ఉంచుకుని, ఆఫర్ ప్రారంభమైన వెంటనే చెక్ చేయాలి. మొదటి గంటల్లోనే ఉత్తమ తగ్గింపులు దొరుకుతాయి. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు ఏవి ఉన్నాయో, ఈఎంఐ ఆప్షన్ వాడితే అదనపు బెనిఫిట్ ఉంటుందో చూడాలి. పాత ఫోన్ ఉంటే ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉపయోగించుకోవచ్చు.
తగ్గేదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్
ఇక చివరిగా చెప్పాలంటే, ఈ సారి ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 సిరీస్ మీద భారీ తగ్గింపు కనిపిస్తోంది. అమెజాన్ మాత్రం ఐఫోన్ 15 సిరీస్‌పై ముందుంది. అందువల్ల మీరు ఏ మోడల్ కొనాలనుకుంటున్నారో దాని ప్రకారం రెండు సైట్లలో మొదటి గంటల్లో ధరలను చెక్ చేయండి. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్‌లు ఉంటే అక్కడ కొనండి, అమెజాన్‌లో ఫైనల్ ప్రైస్ తక్కువైతే అక్కడ తీసుకోండి. మీరు తెలివిగా చెక్ చేస్తే ఆపిల్ ఫోన్ మీ చేతిలోకి రావడం ఖాయం. దీపాల పండుగతో పాటు మీ చేతుల్లో కొత్త ఐఫోన్ కూడా మెరుస్తుంది.