Mithra Mandali: ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ ఎంటర్టైన్ సినిమాలకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విభిన్న కాన్సెప్ట్ తో ఎన్నో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. త్వరలోనే మిత్రమండలి (Mithra Mandali)సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి (Priyadarshi)హీరోగా నిహారిక ఎన్ ఎమ్(Niharika NM) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బన్నీ వాసు (Bunny Vasu)నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇన్ని రోజులపాటు ఈయన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై సినిమాలు చేస్తూ నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. అయితే మొదటిసారి ఈయన బి వి ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి మిత్రమండలి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా విడుదల విషయంలో వినూత్న ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల బన్ని వాసు లిటిల్ హార్ట్స్(Little Hearts) సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కైవసం చేసుకుని భారీ స్థాయిలో లాభాలను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్లను వేసిన సంగతి తెలిసిందే. ఇలా పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో ఈ సినిమాకు పోటీగా విడుదలైన మదరాసి, ఘాటీ సినిమాను డామినేట్ చేస్తూ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఇక ఈ ఫార్ములానే బన్నీ వాసు మిత్రమండలి విషయంలో కూడా అనుసరించబోతున్నారని తెలుస్తోంది.
అంచనాలు పెంచిన ట్రైలర్..
మిత్రమండలి సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లను వేయబోతున్నట్లు తెలుస్తోంది. లిటిల్ హార్ట్స్ విషయంలో ఈ ఆలోచన సక్సెస్ కావడంతో మిత్రమండలి విషయంలో కూడా బన్నీ వాసు అదే ఫార్ములా వాడబోతున్నారని తెలుస్తుంది మరి మిత్రమండలి విషయంలో ఇది వర్కౌట్ అయ్యేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఈ భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో కూడా భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేస్తుంది ఇక ఈ సినిమాలో వెన్నెలకిషోర్, సత్య, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Jr.NTR Dragon OTT : ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… డ్రాగన్‌తో అంత ఈజీ కాదు