E-Paper
Advertisement

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!
Advertisement

Garmin Cirqa Smart Ring: స్మార్ట్ వాచీలంటే టక్కున గుర్తుకొచ్చే పేరు గార్మిన్. ఇప్పటివరకు ఈ రంగంలోనే ఉంటూ వచ్చిన ఈ దిగ్గజ కంపెనీ.. ఇప్పుడు మొదటిసారిగా సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో ఇప్పటికే జోరుమీదున్న స్మార్ట్ రింగ్ ట్రెండ్‌లోకి అడుగుపెట్టేందుకు గార్మిన్ పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి తాజాగా బయటికి వచ్చిన కొన్ని లీక్స్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సాధారణంగా ఏదైనా కొత్త గ్యాజెట్ మార్కెట్లోకి రావడానికి ముందే వివిధ దేశాల సర్టిఫికేషన్ సైట్లలో ప్రత్యక్షమవుతుంటుంది. అలాగే ఇప్పుడు గార్మిన్ రింగ్‌కు సంబంధించిన సమాచారం బ్రెజిల్ టెలికాం రెగ్యులేటరీ ఏజెన్సీ అనటెల్ ద్వారా బయటపడింది. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఏకంగా పది వేర్వేరు మోడల్ నెంబర్లు రిజిస్టర్ కావడం గమనార్హం. ఇవన్నీ ఒకే రోజు నమోదు కావడంతో కంపెనీ దీన్ని పెద్ద ఎత్తున లాంచ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. చైనాలో కూడా ఇదే రకమైన బ్లూటూత్ డివైజ్ సర్టిఫికేషన్ పూర్తి కావడంతో టెక్ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

Advertisement

Also Read: యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

స్మార్ట్ రింగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య సైజ్ సరిపోకపోవడం. అందుకే ఈసారి గార్మిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్ సర్టిఫికేషన్‌లో బయటపడిన పది మోడల్ నెంబర్లు చూస్తుంటే.. ఈ రింగ్‌ను ఏకంగా పది వేర్వేరు సైజుల్లో తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది. చిన్న వేళ్లు ఉన్నవారి నుంచి పెద్ద వేళ్లు ఉన్నవారి వరకు అందరికీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా ఈ డిజైన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దీని సెన్సార్లు, బ్యాటరీ బ్యాకప్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

మార్కెట్లో ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, గార్మిన్ తమ మొదటి రింగ్‌ను సరసమైన ధరకే లాంచ్ చేయాలని చూస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ రింగ్ ధర రూ.19,000 నుంచి రూ.23,000 వరకు ఉండొచ్చు. ఈ రేంజ్‌లో గనుక వస్తే హెల్త్ ట్రాకింగ్ ఇష్టపడే కస్టమర్లకు ఇది చక్కటి ఆప్షన్‌గా మారుతుంది.

ప్రస్తుతానికి దీని విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ.. రెగ్యులేటరీ అప్రూవల్స్ వేగంగా జరుగుతుండటం శుభపరిణామం. ఈ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీన్ని అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ కాస్త ఆలస్యమైతే.. వచ్చే ఏడాది జనవరిలో లాస్ వెగాస్ వేదికగా జరిగే సీఈఎస్ ఈవెంట్ లో దీన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.

Also Read: iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

Tags

Related News

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!

మీ ఫోన్‌లోనూ హిడెన్ యాప్స్ ఇన్‌స్టాల్ అయ్యాయేమో ఇలా చెక్ చేసుకోండి!

మానవ వ్యర్థాలతో.. అత్యంత బలమైన కాంక్రీట్‌.. శాస్త్రవేత్తల నెవర్ బిఫోర్ ప్రయోగం!

Big Stories

Advertisement
×