E-Paper
Advertisement

Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు
Advertisement

హరిహర సుతుడు, కలియుగ వరదుడైన అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం మకర సంక్రాంతి పర్వదినం వేళ భక్తజన సంద్రమైంది. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిరులు మారుమోగాయి. శనివారం సాయంత్రం పొన్నాంబలమేడు పర్వత శిఖరాలపై మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు.

మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా పందాళం రాజప్రసాదం నుంచి శనివారం సాయంత్రం తిరువాభరణాల ఊరేగింపు శబరిమలకు చేరుకుంది. ఈ ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకులు అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అనంతరం మూలమూర్తికి మహా హారతి ఇచ్చారు. ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

Advertisement

సరిగ్గా సూర్యాస్తమయం సమయంలో ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న పొన్నాంబలమేడు పర్వతశ్రేణుల నుంచి దివ్యమైన జ్యోతి  దర్శనమిచ్చింది. క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ వెలుగులీనుతున్న ఆ జ్యోతిని చూడగానే భక్తులందరూ భక్తిపారవశ్యంతో చేతులెత్తి మొక్కుతూ స్వామి నామస్మరణ చేశారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి అయ్యప్ప స్వామికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి కొండలపై నిరీక్షించారు. సన్నిధానం, మాళికాపురం, పాండితావళం వంటి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మకరజ్యోతి దర్శనంతో శబరిమల యాత్రలో అత్యంత ప్రధాన ఘట్టం ముగియడంతో భక్తులు తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు.

Advertisement

ALSO READ: Medaram Jathara: మేడారంలో మొదలైన జాతర సందడి.. పోటెత్తిన భక్త జనసంద్రోహం

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×