E-Paper
Advertisement

Gas Saving Tips: మీ గ్యాస్ స్టవ్ మంట పసుపు రంగులో వస్తోందా? అయితే డబ్బులన్నీ వృధా చేస్తున్నట్లే!

Gas Saving Tips: మీ గ్యాస్ స్టవ్ మంట పసుపు రంగులో వస్తోందా? అయితే డబ్బులన్నీ వృధా చేస్తున్నట్లే!
Advertisement

Gas Saving Tips: ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటేనే భయం వేస్తోంది. ధరలు అలా ఆకాశాన్ని తాకుతున్నాయి మరి! ఒక్కో రూపాయి పొదుపు చేద్దామని మనం వంట దగ్గర రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ, మన కళ్ల ముందే గ్యాస్ వృధా అయిపోతున్నా చాలామంది గమనించరు. అసలు మీ స్టవ్ మంట ఏ రంగులో వస్తోందో ఎప్పుడైనా గమనించారా? అది నీలం రంగులో కాకుండా పసుపు లేదా ఎరుపు రంగులో వస్తుంటే మాత్రం మీరు ప్రమాదంలో పడినట్లే. అంతేకాదు.. మీ కష్టార్జితాన్ని కూడా మంట గలుపుతున్నట్లు అర్థం.

నీలం రంగు వెనకున్న కారణం?

శాస్త్రీయంగా చెప్పాలంటే.. గ్యాస్ మంట నీలం రంగులో ఉందంటే అక్కడ గ్యాస్ పూర్తిగా దహనమవుతోందని అర్థం. దీనివల్ల గరిష్ట స్థాయిలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వంట త్వరగా పూర్తవుతుంది. నీలం రంగు మంట కేవలం వేడిని మాత్రమే కాదు, గ్యాస్ వినియోగంలో సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది. ఇలాంటి మంట వల్ల గిన్నెలు కూడా నల్లగా మారవు.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X8 ప్రో సిరీస్ సేల్ షురూ.. ఈ క్రేజీ ఫీచర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి!

పసుపు మంట ఎందుకొస్తుంది?

ఒకవేళ మీ స్టవ్ మంట పసుపు రంగులో వస్తుంటే.. దానికి ప్రధాన కారణం గాలి సరిగ్గా అందకపోవడం. గ్యాస్ బర్నర్ రంధ్రాలలో దుమ్ము, ఆయిల్ జిడ్డు లేదా వంట చేసేటప్పుడు పాలు, అన్నం గంజి వంటివి పడి రంధ్రాలు మూసుకుపోయినప్పుడు గ్యాస్ సరిగ్గా మండదు. దీనిని ఇన్‌కంప్లీట్ కంబషన్ అంటారు. అంటే గ్యాస్ వృధాగా గాలిలో కలిసిపోతోంది కానీ పూర్తి వేడిని ఇవ్వడం లేదు. దీనివల్ల వంట ఆలస్యమవడమే కాకుండా, సిలిండర్ లోని గ్యాస్ త్వరగా ఖర్చయిపోతుంది. పైగా గిన్నెలు అడుగు భాగంలో నల్లటి మసి పేరుకుపోతుంది.

వృధాను అరికట్టడం ఎలా?

Advertisement

మీరు గ్యాస్ ఆదా చేయాలనుకుంటే ఎప్పటికప్పుడు బర్నర్లను శుభ్రం చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారి బర్నర్లను తీసి నిమ్మరసం లేదా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి, బ్రష్‌తో శుభ్రం చేస్తే రంధ్రాలు క్లియర్ అవుతాయి. దీనివల్ల గాలి ప్రసరణ పెరిగి మంట మళ్లీ నీలం రంగులోకి మారుతుంది. అలాగే స్టవ్ దగ్గర గాలి ఎక్కువగా తగిలేలా కిటికీలు మరీ ఎక్కువగా తెరవకండి. ఎందుకంటే గాలి వేగానికి మంట పక్కకు వెళ్లి గ్యాస్ వృధా అవుతుంది. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో గ్యాస్ వినియోగాన్ని 20 నుండి 30 శాతం వరకు తగ్గించవచ్చు.

Also Read: కరెంట్ అక్కర్లేదు, వై-ఫై వద్దు.. సిమ్ కార్డుతో పనిచేసే ఈ సోలార్ కెమెరా గురించి తెలుసా?

 

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×