E-Paper
Advertisement

1Gbps Free OTT Plan: కేవలం రూ.499కే ఉచిత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ZEE5.. 1Gbps ఇంటర్నెట్ స్పీడ్

1Gbps Free OTT Plan: కేవలం రూ.499కే ఉచిత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ZEE5.. 1Gbps ఇంటర్నెట్ స్పీడ్
Advertisement

1Gbps Free OTT Plan| యాక్ట్ ( ACT) ఫైబర్‌నెట్ తన అన్ని ప్లాన్స్‌ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు 30కి పైగా నగరాల్లో ఈ కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. ఈ సారి ప్రతి ఒక్కరి బడ్జెట్, అవసరాలకు తగినట్లు ప్లాన్స్ రీడిజైన్ చేశారు. పెద్ద ఇళ్లల్లో కూడా సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చే యాక్ట్ స్మార్ట్ వైఫై SmartWiFi టెక్నాలజీ అందుబాటులో ఉండాలనే ప్రధాన లక్ష్యంతో ఈ ప్లాన్స్ తీసుకొచ్చారు.

ప్లాన్స్ ధర, స్పీడ్ ఎలా ఉన్నాయి?

ఇప్పుడు కొత్త ప్లాన్స్ రూ.499 నుంచి మొదలవుతాయి.

Advertisement

రూ.499 ప్లాన్ తీసుకుంటే – 50Mbps స్పీడ్ (Pure Speed)
టాప్ ప్లాన్ – 1Gbps స్పీడ్ కావాలంటే ధర రూ.1,999
వీటితో పాటు మిగతా ప్లాన్స్, వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5 కావాలా?

ఇప్పుడు మూడు కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలు లాంచ్ చేసింది యాక్ట్ ఫైబర్‌నెట్. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, ZEE5, సోనీలివ్, జియో హాట్‌స్టార్, సన్ NXT + 450కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ – ఇవన్నీ ఉచితంగా వస్తాయి! సినిమాలు, వెబ్ సిరీస్ చూడాలనుకునేవాళ్లకి బెస్ట్.

ACT SmartWiFi అంటే ఏమిటి?

Advertisement

ఇది AI ఆధారిత కొత్త టెక్నాలజీ. పెద్ద ఇళ్లలో కూడా ఎక్కడా ఇంటర్నెట్ స్లో కాదు. ఇందులో ప్రధానంగా మెష్ టెక్నాలజీని ఉపయోగించి ఇంట్లో డెడ్ జోన్స్ లేకుండా చేసి ప్రతి మూల లోనూ నెట్ రీచ్ ఉంటుంది. స్పీడ్, కనెక్షన్ ఆటోమాటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది.

ఏ నగరాల్లో ఎంత ధర?

ఢిల్లీ, జైపూర్, లక్నో నగరాల్లో రూ.749 నుంచి
అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.749 నుంచి
హైదరాబాద్ నగరంలో రూ.798 నుంచి
విజయవాడలో రూ.778 నుంచి
పూణే లో రూ.848 నుంచి
చిన్న నగరాలు (హోసూర్ లాంటివి) రూ.650 నుంచి ప్లాన్స్ ఉన్నాయి.

ఎక్కడ బుక్ చేసుకోవాలి?

ఇప్పటి నుంచే actcorp.in వెబ్‌సైట్‌లో కొత్త ప్లాన్స్ లభిస్తాయి. పాత కస్టమర్లు కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో యూజర్ల అభిప్రాయాలు తీసుకొని ఈ ప్లాన్స్ రూపొందించారు.
ఇంటర్నెట్ + ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఒకేసారి కావాలంటే ACT కొత్త ప్లాన్స్ సూపర్ ఆప్షన్! ఇప్పుడే వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ నగరం అక్కడ లభించే ప్లాన్ చెక్ చేసుకోండి.

Also Read: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×