Plants: నేటి నగర జీవితంలో ముఖ్యంగా చిన్న అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి.. గాలి నాణ్యత ఒక పెద్ద సమస్యగా మారింది. ఫర్నిచర్, రంగులు, క్లీనింగ్ ఉత్పత్తులు, ఇతర గృహోపకరణాల నుంచి వెలువడే హాని కరమైన రసాయనాలు మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. అయితే.. ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే గాలిని శుద్ధి చేసే మొక్కలు. చిన్న స్థలంలో కూడా చక్కగా పెరిగే, గాలిని పరిశుభ్రం చేసే, మన ఇంటికి పచ్చని అందాన్నిచ్చే ఆరు అద్భుతమైన మొక్కలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్నేక్ ప్లాంట్ :
ఇది అత్యంత దృఢమైన మొక్క. ఇది పగటిపూట కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేయడమే కాక.. రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. చిన్న స్థలాలకు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది నిలువుగా పెరుగుతుంది. కాబట్టి కిటికీ పక్కన లేదా చిన్న టేబుల్‌పై సులభంగా ఉంచవచ్చు. దీనికి తక్కువ నీరు, తక్కువ కాంతి సరిపోతాయి. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరెథిలిన్ వంటి వాటిని ఇది శుద్ది చేస్తుంది.
2. పీస్ లిల్లీ :
దీని ఆకుపచ్చని ఆకులు, తెల్లని పూలు మీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. వీటికి చిన్న ప్లేస్ అనుకూలంగా ఉంటుంది. ఇది తక్కువ వెలుతురుల కూడా చక్కగా పెరుగుతుంది. కాబట్టి మీ అపార్ట్‌మెంట్‌లోని చీకటి మూలల్లో కూడాపెంచుకోవచ్చు. అమోనియా , బెంజీన్, ఫార్మాల్డిహైడ్, మరికొన్ని రకాల టాక్సిన్స్ శుద్ది చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
3. పోతోస్ / మనీ ప్లాంట్ :
ఈ పాకే స్వభావం గల మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. ఇది పెంచడానికి చాలా సులభమైన మొక్క. అందుకే మొక్కలు పెంచడం కొత్తగా నేర్చుకునే వారికి ఇది చాలా మంచిది. చిన్న స్థలాలకు అనుకూలంగా ఉంటుంది. దీనిని హ్యాంగింగ్ బాస్కెట్‌లలో లేదా ఎత్తైన అల్మారాల పైన ఉంచితే.. ఆకులు కిందకు దారాలుగా వేలాడుతూ అందంగా కనిపిస్తాయి. తద్వారా నేలపై స్థలం ఆదా అవుతుంది. ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ , బెంజీన్ వంటి వాటిని శుద్ది చేయడంలో కూడా ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా ఇది తక్కువ కాంతిని కూడా తట్టుకోగలదు.
4. స్పైడర్ ప్లాంట్ :
వంపు తిరిగిన ఆకుపచ్చ , తెలుపు ఆకులు ఉండే.. స్పైడర్ ప్లాంట్‌లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి చిన్న “పిల్ల” మొక్కలు వస్తాయి. వీటిని సులభంగా వేరే కుండీలలో నాటుకోవచ్చు. చిన్న చిన్న స్థలాలకు కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా చిన్న కుండీల్లో లేదా హ్యాంగింగ్ ప్లాంటర్‌లలో కూడా ఇది బాగా సరిపోతుంది. కాబట్టి ఇది పెంపుడు జంతువులు, పిల్లలు ఉన్న ఇళ్లకు అనుకూలం. ఫార్మాల్డిహైడ్, జైలీన్, కార్బన్ మోనాక్సైడ్. దీనికి పరోక్ష సూర్యరశ్మి, తక్కువ నీరు ఉన్న ఉన్న ప్రాంతంలో కూడా బాగా పెరుగుతాయి.
5. రబ్బర్ ప్లాంట్ :
మందపాటి, నిగనిగలాడే ఆకులు ఉండే రబ్బర్ ప్లాంట్ గదికి ఒక ప్రత్యేకమైన శోభను ఇస్తాయి. ఇవి చిన్న స్థలాలకు అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా చిన్న చిన్న అపార్ట్‌మెంట్‌లలో వీటిని కుండీల్లో పెంచితే, అది కొంచెం నెమ్మదిగా పెరుగుతూ, ఒక కాంపాక్ట్ సైజులో ఉంటుంది. వెలుతురు బాగా తగిలే ప్రదేశంలో వీటిని ఉంచాలి. ఫార్మాల్డిహైడ్ వంటి విషపదార్థాలను సమర్థవంతంగా ఇది తొలగిస్తుంది.
Also Read: గుడ్డు పెంకు రంగు వెనుక ఉన్న సైన్స్.. పోషక విలువల్లో తేడా ఉంటుందా ?
6. అలోవెరా :
అలోవెరాలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని జెల్ చర్మ సమస్యలకు చాలా మంచిది. ఇది నిలువుగా తక్కువ స్థలంలో పెరుగుతుంది. ఎక్కువ సూర్యరశ్మి, చాలా తక్కువ నీరు అవసరం కాబట్టి దీనిని కిటికీ పక్కన ఉంచడం ఉత్తమం.
చిన్న అపార్ట్‌మెంట్‌లలో కూడా ఈ ఆరు మొక్కలను సులభంగా పెంచడం ద్వారా మీ ఇంటి గాలిని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ పచ్చని మొక్కలు మీ ఇంటికి అందాన్ని, ప్రశాంతతను, స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఉపయోగపడతాయి.