E-Paper
Advertisement

Vivo Discount: 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌గల వివో ఫోన్‌పై రూ.8000 డిస్కౌంట్.. విజయ్ సేల్స్ ఆఫర్

Vivo Discount: 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌గల వివో ఫోన్‌పై రూ.8000 డిస్కౌంట్.. విజయ్ సేల్స్ ఆఫర్

Vivo Discount| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఆగస్టు 2025లో వివో V60 విడుదల చేసింది. ఈ ఫోన్ అందమైన డిజైన్‌తోపాటు, బలమైన ఫీచర్లతో మిడ్ రేంజ్‌లో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్‌ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ఆఫర్‌ పరిమిత కాలం మాత్రమే.. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ.8,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

డిస్కౌంట్, ఆఫర్ వివరాలు

వివో V60 లాంచ్ ధర రూ.43,999. విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్‌ 11 శాతం డిస్కౌంట్‌తో లిస్ట్ అయింది. ఈ తగ్గింపు తరువాత 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.38,999కి తగ్గింది. కంపెనీ నుంచి డైరెక్ట్‌గా రూ.5,000 తగ్గింపు ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMIలో కొంటే మరో రూ.3,000 తగ్గింపు వస్తుంది. HSBC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే కూడా 7.5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మొత్తం డిస్కౌంట్ రూ.8,000 వరకు ఉంటుంది.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

వివో V60లో 6.67 ఇంచ్ పెద్ద ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రెజల్యూషన్‌తో స్పష్టమైన చిత్రాలు ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే డిజైన్‌తో ఫోన్ చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా స్టైలష్‌గా అనిపిస్తుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ సులభంగా జరుగుతాయి. యాప్‌లు లాగ్ లేకుండా సాఫీగా నడుస్తాయి. ఆండ్రాయిడ్ 15తో ఫన్‌టచ్ ఓఎస్ 15 ఉంది. ఇది చాలా సులభంగా, శుభ్రంగా ఉపయోగించుకోవచ్చు.

బ్యాటరీ, ఛార్జింగ్

వివో V60లో 6500mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఎక్కువ సేపు వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ చేసినా ఒక్కసారి ఛార్జ్‌తో ఎక్కువ సమయం నడుస్తుంది. గేమర్లు, హెవీ యూజర్లకు బాగా సరిపోతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

కెమెరా కెపాసిటీ

వివో V60లో ZEISS టెక్నాలజీతో మంచి పవర్‌ఫుల్ కెమెరా సెటప్ ఉంది. వెనక 50MP ప్రైమరీ సెన్సార్ స్పష్టమైన, వివరాలతో కూడిన ఫోటోలు తీస్తుంది. 50MP సూపర్ టెలిఫోటో కెమెరా దూరంగా ఉన్న వస్తువులను క్లియర్‌గా షూట్ చేస్తుంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా వైడ్ యాంగిల్ ఫోటోలకు ఉపయోగపడుతుంది. సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది చాలా షార్ప్, అందమైన సెల్ఫీలు ఇస్తుంది.

Also Read: స్మార్ట్‌వాచ్‌తో చేతికి గాయాలు.. ఆపిల్ సపోర్ట్‌లో గందరగోళం

డ్యూరబిలిటీ, కనెక్టివిటీ

ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్స్‌తో వస్తుంది. దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. 5G, బ్లూటూత్ 5.4, NFC, GPS, IR బ్లాస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

వివో V60 బలమైన ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో వస్తోంది. ప్రస్తుత డిస్కౌంట్‌తో ఇది చాలా మంచి డీల్ అవుతోంది. పర్‌ఫామెన్స్, కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఇది ఆకర్షణీయ ఆప్షన్.

ముఖ్య గమనిక: ఈ కథనంలో మీకు తెలిపిన వివో స్మార్ట్‌ఫోన్ ధరలు.. ఆ కంపెనీ ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు బాగా ఆలోచించుకొని కొనుగోలు చేయండి. మీరు కొనే సమయానికి పైన పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. అందుకు అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×