E-Paper
Advertisement

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి
Advertisement

Child Sleeping Late Every Night| ఈ రోజుల్లో పిల్లలు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం చాలా సాధారణంగా మారింది. మొబైల్ ఫోన్లు, టీవీ, గేమ్స్, చదువులు వంటి కారణాలతో బెడ్‌టైమ్ ఆలస్యమవుతోంది. అయితే పెరుగుతున్న పిల్లలకు తగినంత నిద్ర చాలా అవసరం. నిద్ర శరీరానికి విశ్రాంతిని అందించడంతో పాటు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు పిల్లలకు అలసటగా అనిపిస్తుంది. వారి మూడ్, శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యంపై కూడా ప్రభావం ఉంటుంది. అందుకే చైల్డ్ సైకాలజిస్ట్ నిపుణులు పిల్లల నిద్ర అలవాట్లపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.

రాత్రి 10 తర్వాత నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

పిల్లలు రాత్రి 10 తర్వాత నిద్రపోతే వెంటనే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పలేం. అయితే ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం నిద్ర షెడ్యూల్‌ను అసమతుల్యం అవుతుంది. పిల్లలకు సరైన నిద్ర లభించకపోతే ఉదయం అలసటగా అనిపించవచ్చు. దీంతో స్కూల్ లో పనులు, ఆటలు, ఇతర రోజువారీ కార్యకలాపాలు ప్రభావితమవుతాయి. నిద్ర సమయంలో శరీర ఎదుగుదలకు సంబంధించిన ముఖ్యమైన ప్రక్రియలు జరుగుతాయి. అందుకే పిల్లలకు సరిపడా నిద్రతో పాటు క్రమబద్ధమైన నిద్ర సమయం కూడా అవసరం.

పిల్లలకు ప్రతిరోజూ ఒకే బెడ్‌టైమ్‌ ఉండేలా చూడాలి

Advertisement

పిల్లలు ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా తల్లిదండ్రులు ప్రయత్నించాలి. రాత్రి 9 గంటలకు నిద్రపోవాలంటే రాత్రి 8 గంటల నుంచే బెడ్‌టైమ్ రొటీన్ ప్రారంభించండి. స్నానం చేయించడం, నైట్‌డ్రెస్ వేసుకోవడం, పళ్లు శుభ్రం చేయించడం వంటి పనులు చేయాలి. ఆ తర్వాత కథ చదవడం లేదా ప్రశాంతంగా మాట్లాడటం వంటి అలవాట్లు పెంపొందించాలి. ఇలాంటి రొటీన్‌ను ప్రతిరోజూ పాటిస్తే పిల్లలకు నిద్ర సమయం అర్థమవుతుంది.

సాయంత్రం నిద్రపోకుండా పిల్లలను గమనించాలి

కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాసేపు నిద్రపోతారు. అలా సాయంత్రం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి త్వరగా నిద్ర రావడం కష్టమవుతుంది. అందుకే మధ్యాహ్నం తర్వాత పిల్లల నిద్ర సమయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. సాయంత్రం అలసిపోయినప్పుడు ప్రశాంతమైన ఆటలు లేదా ఇతర తేలికపాటి పనులు చేయించాలి.

నిద్రకు ముందు మొబైల్, టీవీకి దూరంగా ఉంచాలి

Advertisement

బెడ్‌టైమ్‌కు ముందు మొబైల్, టీవీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలు.. పిల్లలకు దూరంగా ఉంచాలి లేదా వాడకాన్ని తగ్గించడం మంచిది.
సాధ్యమైతే నిద్రకు ఒకటి లేదా రెండు గంటల ముందు స్క్రీన్‌లను ఆపేయాలి. ఆ సమయంలో పిల్లలతో మాట్లాడటం లేదా కథలు చదవడం వంటి అలవాట్లు పెట్టుకోవచ్చు.

పగటిపూట పిల్లలు చురుగ్గా ఉండేలా చూడాలి

పిల్లలకు పగటిపూట ఆడుకోవడానికి, శారీరకంగా చురుగ్గా ఉండటానికి అవకాశం ఇవ్వాలి. బయట ఆడుకోవడం వల్ల వారికి తగినంత శారీరక చలనం లభిస్తుంది. అయితే నిద్రకు ముందు ఎక్కువ ఉత్సాహం కలిగించే ఆటలను నివారించడం మంచిది.

Also Read: చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

బెడ్‌టైమ్ సమయంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి

పిల్లలు నిద్రపోయే సమయంలో ఇంట్లో ఎక్కువ శబ్దం లేకుండా చూడాలి. లైట్లు కొద్దిగా తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చు. పిల్లలతో కూడా నెమ్మదిగా, ప్రశాంతంగా మాట్లాడటం ఉపయోగపడుతుంది.

పిల్లలతో పాటు తల్లిదండ్రులు అదే సమయంలో నిద్రపోవాల్సిన అవసరం లేదు

పిల్లల బెడ్‌టైమ్ రొటీన్‌ కోసం తల్లిదండ్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. తర్వాత వారు తమ సాధారణ పనులను కొనసాగించవచ్చు.
ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉన్న పిల్లలు మొదట్లో ముందుగా పడుకోవడానికి నిరాకరించే అవకాశ ఉంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే రొటీన్‌ను పాటిస్తూ నిద్ర సమయాన్ని క్రమంగా మార్చడం మంచిది. నిద్ర సమస్యలు నిరంతరం కొనసాగితే పిల్లల వైద్యుడిని సంప్రదించండి.

Also Read: అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

Related News

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

Big Stories

Advertisement
×