E-Paper
Advertisement

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!
Advertisement

Dell AI Laptops: నేటి ఆధునిక యుగంలో మనం ఏ డివైజ్ కొన్నా అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు ఉన్నాయా లేదా అని ముందుగా చూస్తున్నాం. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ దిగ్గజ సంస్థ డెల్.. భారత మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు, వర్క్‌స్టేషన్లను తీసుకొచ్చింది. ముంబైలో జరిగిన ‘డెల్ టెక్నాలజీస్ ఫోరమ్ 2026’ ఈవెంట్‌లో వీటిని అధికారికంగా లాంచ్ చేశారు. ఆఫీసులోనే కాకుండా ఎక్కడ ఉన్నా ఆన్‌లైన్ పనులు సులువుగా చేసుకునేలా 5G, వైఫై 7 వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో అందించారు.

కొత్త డెల్ ప్రో ల్యాప్‌టాప్‌లు:

డెల్ కొత్తగా ప్రో 7, ప్రో 5, ప్రో 3 సిరీస్ ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఇన్‌బిల్ట్ ఏఐ ప్రాసెసర్లతో పనిచేస్తాయి. ప్రో 7 మోడల్ అత్యంత వేగవంతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 23 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ప్రో 5 మోడల్ రోజూవారీ ఆఫీస్ పనులకు, డిజైనింగ్ పనులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బడ్జెట్ ధరకు తగినట్లుగా ఎవరైనా వాడుకునేలా ప్రో 3 ల్యాప్‌టాప్‌లను రూపొందించారు. వీటిలో ఇంటర్నెట్ కోసం 5G, వైఫై 7 కనెక్టివిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

పవర్‌ఫుల్ వర్క్‌స్టేషన్లు:

హెవీ గ్రాఫిక్స్, కోడింగ్, ఏఐ డెవలప్‌మెంట్ చేసే నిపుణుల కోసం ‘ప్రెసిషన్ 9’ సిరీస్ డెస్క్‌టాప్ వర్క్‌స్టేషన్లను లాంచ్ చేశారు. ఇవి భారీ డేటాను సెకన్లలో ప్రాసెస్ చేయగలవు. ఎంత పెద్ద పని అయినా ఎలాంటి ఆటంకం లేకుండా చాలా వేగంగా పూర్తవుతుంది. దీంతో పాటు రిమోట్ పనుల కోసం ‘ప్రో ప్రెసిషన్ 7’ అనే రాక్ సర్వర్ మోడల్‌ను కూడా పరిచయం చేశారు.

అధునాతన మానిటర్లు:

Advertisement

కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటల తరబడి పనిచేసే వారి కోసం డెల్ రెండు ప్రత్యేక మానిటర్లను తీసుకొచ్చింది. అందులో ఒకటి డెల్ ప్రో P43 కాన్ఫరెన్సింగ్ మానిటర్. దీనిలో కెమెరా, మైక్‌లు బిల్ట్‌ఇన్‌గా వస్తాయి. తద్వారా వీడియో కాల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రెండోది కలర్ క్వాలిటీ, ఎడిటింగ్ పనుల కోసం రూపొందించిన ఆల్ట్రాషార్ప్ 32 క్యూడీ ఓఎల్ఈడీ మానిటర్. ఇది కళ్లకు ఎలాంటి శ్రమ కలగకుండా అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీని ఇస్తుంది.

స్మార్ట్ 4కే వెబ్‌క్యామ్:

మీటింగ్స్ ఎక్కువగా అటెండ్ అయ్యేవారి కోసం డెల్ ప్రో 7 పేరుతో ఒక వెబ్‌క్యామ్‌ను కూడా లాంచ్ చేశారు. ఇది ఏఐ ఫీచర్లతో పనిచేస్తుంది. మనం కదిలినా కెమెరా మనల్ని ఆటోమేటిక్‌గా ఫోకస్ చేస్తుంది. చేతి సంకేతాలతోనే కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. ఆఫీస్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ కోసం డెల్ తెచ్చిన ఈ కొత్త ఉత్పత్తులు నిజంగానే మన పనిని చాలా సులభతరం చేస్తాయి.

Also Read: పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Tags

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×