E-Paper
Advertisement

గూగుల్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఏకంగా 5TB ఉచిత స్టోరేజ్.. ఎలా పొందాలంటే?

గూగుల్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఏకంగా 5TB ఉచిత స్టోరేజ్.. ఎలా పొందాలంటే?
Advertisement

Google Storage: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. తన యూజర్లకు ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్ ఏఐ ప్రో (Google AI Pro) ప్లాన్ వాడుతున్న వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా స్టోరేజ్ సామర్థ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచింది. గతవారమే గూగుల్ ఈ బంపరాఫర్ ప్రకటించినప్పటికీ.. తాజాగా వాటి ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రకటించిన ఈ ఆఫర్ వివరాలు? ఇందుకు గల ప్రధాన కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.

5TB ఉచిత స్టోరేజ్

గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ లో ఇప్పటివరకూ 2TB స్టోరేజ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని ఏకంగా 5TBకి పెంచుతూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. స్టోరేజ్ పెరిగినప్పటికీ చెల్లించాల్సిన నెలవారీ, వార్షిక రుసుముల్లో ఎలాంటి మార్పు గూగుల్ చేయలేదు. ఇండియాలో గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ నెలవారి ధర రూ.1,950 గానే కొనసాగుతోంది.

అన్ని సర్వీసులకు వర్తిస్తుంది

Advertisement

గూగుల్ ఆఫర్ చేస్తున్నఈ 5TB స్పేస్‌ను గూగుల్ డ్రైవ్ (Drive), జిమెయిల్ (Gmail), గూగుల్ ఫొటోస్ (Photos) వంటి అన్ని గూగుల్ సర్వీసుల్లో ఉపయోగించుకోవచ్చు. మరోవైపు రిలయన్స్ జియో ఆఫర్ ద్వారా లేదా కాంప్లిమెంటరీగా AI Pro సబ్‌స్క్రిప్షన్ పొందిన వారికి కూడా ఈ 5TB బెనిఫిట్ వర్తిస్తుందని గూగుల్ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read: బడ్జెట్ నిర్వాహణలో టాలీవుడ్ అంత పూరా?.. ఈ విషయాలు తెలిస్తే మతి పోతుంది..

ఎందుకు ఈ మార్పు?

Advertisement

ప్రస్తుతం AI ద్వారా క్రియేట్ చేసే హై-రిజల్యూషన్ వీడియోలు, ఇమేజ్‌లు, ఇతర భారీ ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ స్టోరేజ్ అవసరమవుతోంది. ఫలితంగా ఫోన్, కంప్యూటర్ లోని స్టోరేజ్ త్వరగా నిండిపోతోందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిని గుర్తించిన గూగుల్.. ఇప్పటివరకూ ఏఐ ప్లాన్ కింద అందిస్తున్న 2TB స్టోరేజ్ కు అదనంగా మరో 3TB స్టోరేజ్‌ను ఉచితంగా జోడించింది.

Also Read: కొత్త ఐటీ రూల్స్.. ఉద్యోగుల పంట పండినట్లే.. వామ్మో ఎన్ని ప్రయోజనాలో..!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×