E-Paper
Advertisement

మీ ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే.. ఇక గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు!

మీ ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే.. ఇక గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు!
Advertisement

Government Apps: స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం వాట్సప్‌లో చాటింగ్, ఇన్‌స్టా రీల్స్ స్క్రోలింగ్, యూట్యూబ్ షార్ట్స్ చూడటానికి మాత్రమే కాదు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జేబులో ఒక మినీ ప్రభుత్వ కార్యాలయాన్నే మెయింటైన్ చేయొచ్చు. నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కావాలన్నా, లైసెన్స్ అప్లై చేసుకోవాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌తో అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇలాంటి వాటి కోసమే మన కేంద్ర ప్రభుత్వం 5 కీలకమైన యాప్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడంతా జస్ట్ మన వేలిముద్రతోనే అన్ని పనులు అయిపోతున్నాయి. మరి మనందరి ఫోన్లలో కచ్చితంగా ఉండాల్సిన ఆ ఐదు యాప్‌ల విశేషాలేంటో చూద్దామా.

గుర్తింపు కార్డులు మరిచిపోయినా పర్లేదు..

ఆధార్ కార్డు మనందరికీ ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే ప్రతి చోటికి ఆ ఒరిజినల్ కార్డు పట్టుకెళ్లడం కష్టం. పైగా అది ఎక్కడైనా పోతుందేమో అన్న భయం ఉంటుంది. అందుకే ‘ఆధార్ యాప్’ ఉంటే మీ ఫోనే మీ ఐడెంటిటీ కార్డు అయిపోతుంది. ఇందులో మీ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. దీనివల్ల మీ సమాచారం చాలా సేఫ్‌గా ఉంటుంది. ఇక సర్టిఫికేట్ల విషయానికి వస్తే ‘డిజిలాకర్’ అనేది పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. టెన్త్ క్లాస్ మెమో నుంచి పాన్ కార్డ్ వరకు అన్నీ దీనిలో దాచుకోవచ్చు. ఎక్కడైనా డాక్యుమెంట్లు అడిగినప్పుడు ఫిజికల్ పేపర్లు కాకుండా డిజిలాకర్‌లో చూపిస్తే సరిపోతుంది. అవి చట్టబద్ధంగా చెల్లుతాయి కూడా.

Advertisement

Also Read: ఐఫోన్ లవర్స్ ఎగిరి గంతేసే డిస్కౌంట్.. Apple Airపై ఏకంగా రూ.30,000 ధర తగ్గింపు!

అన్నీ కలిపి ఒకే చోట అదే ‘ఉమాంగ్’..

ఒక్కో పనికి ఒక్కో యాప్ ఎక్కించుకోవడం తలనొప్పి అనుకునే వాళ్లకు ‘ఉమాంగ్’ యాప్ బెస్ట్ ఆప్షన్. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలన్నా, లేదా కరెంటు బిల్లు కట్టాలన్నా.. ఇలా వందలాది సేవలు దీనిలో దొరుకుతాయి. తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఇది అందుబాటులో ఉండటం వల్ల ఊర్లలో ఉండే వాళ్లకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. గవర్నమెంట్ సర్వీసులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత ఈ యాప్‌దే.

లైసెన్స్ జేబులో లేకపోయినా నో టెన్షన్..

Advertisement

బండి మీద బయటకు వెళ్లినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ బుక్ ఇంట్లో మర్చిపోతే చలానా పడుతుందేమో అని భయపడతాం. అలాంటి టైంలో ‘ఎం-పరివాహన్’ యాప్ మనల్ని కాపాడుతుంది. ఇందులో మీ బండి వివరాలు చూపిస్తే ట్రాఫిక్ పోలీసులు అంగీకరిస్తారు. ఇక డబ్బుల లావాదేవీల కోసం ‘భీమ్’ యాప్ ఉంది. ఇది చాలా సింపుల్‌గా, ఎంతో భద్రంగా ఉంటుంది. కొత్తగా ఆన్‌లైన్ పేమెంట్స్ నేర్చుకునే వారికి ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. ఎవరికైనా చిటికెలో డబ్బులు పంపాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ యాప్.

అన్నీ చిటికెలోనే..

నిజానికి ఈ యాప్‌లన్నీ కేవలం టెక్నాలజీ కోసం మాత్రమే కాదు.. సామాన్యుడి కష్టాలను తీర్చడం కోసం వచ్చినవి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా మన పనిని మనమే చేసుకునేలా ఇవి మనల్ని తయారు చేస్తాయి. పేపర్ల గొడవ లేకుండా ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.

Also Read: iPhone 17పై ఊహించని ధర తగ్గింపు.. రూ.45,000కే లేటెస్ట్ మోడల్, ఎగబడి కొంటున్న జనం!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×