E-Paper
Advertisement

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?
Advertisement

YouTube Music AI Labels: సంగీత ప్రియుల కోసం యూట్యూబ్ మ్యూజిక్ ఒక కీలకమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పాటలు రూపొందించడం చాలా సాధారణమైపోయింది. అయితే మనం వింటున్న పాటను మనిషి పాడారా లేక ఏఐ టెక్నాలజీతో సృష్టించారా అని తెలుసుకోవడం ఆడియన్స్‌కి కష్టంగా మారింది. అందుకే వారికి స్పష్టతనివ్వడానికి యూట్యూబ్ మ్యూజిక్ తమ ప్లాట్‌ఫామ్‌లో ఏఐతో తయారు చేసిన పాటలకు ప్రత్యేక లేబుల్స్ వేయడం ప్రారంభించింది. ఇది పాటల వివరాలను మరింత పారదర్శకంగా మారుస్తుంది.

మూడు రకాల లేబుల్స్..

పాట తయారీలో ఏఐ ఎంతవరకు ఉపయోగపడిందో చెప్పడానికి యూట్యూబ్ మూడు వేర్వేరు లేబుళ్లను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ సాంకేతికతతోనే రూపొందించిన పాటలకు ఫుల్లీ జెన్ ఏఐ లేబుల్ ఉంటుంది. పాటలో కొంత భాగం ఏఐ, మరికొంత మనుషుల శ్రమ ఉంటే పార్ట్లీ జెన్ ఏఐ అని చూపిస్తుంది. ఇక కేవలం ఆటోట్యూన్ లేదా పిచ్ కరెక్షన్ మాత్రమే వాడిన పాటలను నార్మల్ పాటలుగానే పరిగణించి నో జెన్ ఏఐ లేబుల్ కింద ఉంచుతారు.

Advertisement

Also Read: మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

ఇతర యాప్‌ల విధానం..

ఏఐ మ్యూజిక్ విషయంలో ఒక్కో మ్యూజిక్ యాప్ ఒక్కో దారిలో వెళ్తోంది. డిజర్, టైడల్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఏఐ పాటలపై చాలా కఠినంగా ఉంటున్నాయి. డిజర్ ప్లాట్‌ఫామ్‌లోకి రోజుకు వేల సంఖ్యలో ఏఐ పాటలు వస్తుండటంతో.. వాటికి రాయల్టీలు ఇవ్వకుండా బ్లాక్ చేస్తోంది. టైడల్ కూడా ఏఐ పాటలను ఆడియన్స్ డిసేబుల్ చేసుకునే సదుపాయం ఇచ్చింది. యాపిల్ మ్యూజిక్ కూడా త్వరలోనే ఇలాంటి పారదర్శకత చర్యలు తీసుకోబోతోంది.

యూట్యూబ్ భిన్నమైన ఆలోచన..

Advertisement

మిగతా యాప్‌లు ఏఐ పాటలపై ఆంక్షలు విధిస్తుంటే.. యూట్యూబ్ మాత్రం కేవలం పారదర్శకతకే ప్రాధాన్యత ఇస్తోంది. అంటే పాట ఏఐతో చేసినప్పటికీ దానిపై నిషేధం ఉండదు. దీంతో ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. పైగా యూట్యూబ్ స్వయంగా ‘డ్రీమ్ ట్రాక్’ పేరుతో ప్రముఖ సింగర్ల వాయిస్ బేస్‌తో ఏఐ పాటలు తయారు చేసే కొత్త టూల్స్‌ను కూడా టెస్ట్ చేస్తోంది.

ఆడియన్స్‌కు పూర్తి స్పష్టత..

ఇకపై యూట్యూబ్ మ్యూజిక్ లేదా మెయిన్ యూట్యూబ్ యాప్‌లో పాట ప్లే అవుతున్నప్పుడు స్క్రీన్‌పై ఈ లేబుల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ పాట తయారీ గురించి మరింత సమాచారం తెలుస్తుంది. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో.. ఆడియన్స్ తాము వినే సంగీతం అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఈ కొత్త మార్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

Tags

Related News

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

ఆకట్టుకునే లుక్, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్స్‌తో Samsung Galaxy F70 5G వచ్చేస్తోంది!

ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!

ఆఫీస్,స్టడీస్ కోసం బెస్ట్ డెల్ ల్యాప్‌టాప్..120Hz డిస్‌ప్లేతో అదుర్స్!

Big Stories

Advertisement
×