E-Paper
Advertisement

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
Advertisement

Supreme Court: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్​ పథకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్​ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.

పిటిషన్ నేపథ్యం..

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్​ పథకాలను అమలు చేస్తోందంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ జోయ్​ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే ప్రభుత్వ ధనానికి చట్టపరమైన అనుమతులు ఉండాలని విజయ్​ గోపాల్​ తన పిటిషన్​ లో పేర్కొన్నారు. ఈ రండు పథకాలకు అలాంటి అనుమతులు లేవని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

గతంలోనే హైకోర్టులో పిటిషన్

Advertisement

నిజానికి దీనిపై సమీక్ష జరపాలని అభ్యర్థిస్తూ గతంలోనే తెలంగాణ హైకోర్టులో విజయ్​ గోపాల్ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పథకాల కింద ప్రభుత్వం ఇప్పటివరకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొంటూ వాటి రాజ్యాంగబద్దతను పరిశీలించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తరపున ఎలాంటి కౌంటర్లు దాఖలు కాకపోవటంతో ఎనిమిది జీవోలపై ఆగస్టు 12న స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ రెండు పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

డివిజన్ బెంచ్‌లో సవాల్

దీనిని ప్రభుత్వం.. హైకోర్టు డివిజన్​ బెంచ్​ లో సవాల్​ చేసింది. విచారణ జరిపిన డివిజన్​ బెంచ్​ సింగిల్​ బెంచ్​ జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ సెప్టెంబర్​ 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్​ జడ్జి కోర్టులో ఉన్న పిటిషన్​ పై విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్​ చేస్తూ విజయ్ గోపాల్​ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని ధర్మాసనంలో పిటిషన్​ వేశారు.

Advertisement

Also Read: యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అయితే, హైకోర్టు డివిజన్​ బెంచ్​ సెప్టెంబర్​ 1న జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవటానికి ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ బెంచ్​ కోర్టు ముందున్న విచారణను నిలిపివేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్​ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Tags

Related News

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న ఆరు కార్లు, హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

Big Stories

Advertisement
×