E-Paper
Advertisement

Google Fitbit: గూగుల్ నుంచి సరికొత్త ‘ఫిట్‌బిట్’ బ్యాండ్.. హూప్‌కు గట్టి పోటీ తప్పదా?

Google Fitbit: గూగుల్ నుంచి సరికొత్త ‘ఫిట్‌బిట్’ బ్యాండ్.. హూప్‌కు గట్టి పోటీ తప్పదా?
Advertisement

Google Fitbit: కరోనా తర్వాత యువతలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెరిగింది. దీని కోసం రోజూ వ్యాయామాలు చేస్తూ.. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు నిత్యం ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా స్మార్ట్ వాచెస్, స్మార్ట్స్ రింగ్స్, ఫిట్‌నెస్ బ్యాండ్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయితే కొంతమందికి చేతికి పెద్ద పెద్ద స్మార్ట్ వాచీలు కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దీంతో డిస్‌ప్లే లేని ఫిట్‌నెస్ బ్యాండ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన గూగుల్.. తమ ‘ఫిట్‌బిట్’ బ్రాండ్ ద్వారా ఓ కొత్త రకం బ్యాండ్‌ను తెచ్చేందుకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో బాగా పాపులర్ అయిన హూప్, ఓరా వంటి వాటికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గూగుల్ అడుగులు వేస్తోంది. కేవలం డేటా చూపించడమే కాదు.. మన లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

స్టెఫన్ కర్రీ వీడియోతో వైరల్..

ఈ కొత్త డివైజ్ గురించి ఎన్బీఏ బాస్కెట్‌బాల్ స్టార్ స్టెఫన్ కర్రీ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసి అందరిలో ఆసక్తి పెంచేశారు. ‘నా హెల్త్‌తో నాకు కొత్త రిలేషన్ మొదలు కాబోతోంది’ అంటూ ఆయన హింట్ ఇచ్చారు. ఈ బ్యాండ్ చూడటానికి చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంది. గ్రే కలర్ క్లాత్ మెటీరియల్, లోపల ఆరెంజ్ లైనింగ్‌తో హూప్ బ్యాండ్‌ను తలపిస్తోంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే.. హూప్ కంపెనీ వాళ్లు హార్డ్‌వేర్ ఫ్రీగా ఇచ్చి సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు తీసుకుంటారు. కానీ గూగుల్ మాత్రం బ్యాండ్‌కు కొంత ధర నిర్ణయించి, స్పెషల్ ఫీచర్ల కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పెట్టే ఆలోచనలో ఉంది.

Advertisement

Also Read: Vivo V70 FE అరాచకం.. చీకట్లో మెరుస్తుంది, నీటిలోనూ ఫొటోలు తీస్తుంది, కెమెరా పిచ్చ క్లారిటీ బ్రో!

పర్సనల్ ఏఐ కోచ్ లాంటిది..

ఈ బ్యాండ్ స్పెషాలిటీ ఏమిటంటే.. దీనిలో గూగుల్ AI టెక్నాలజీని వాడుతోంది. ఇది కేవలం మనం రోజుకి ఎన్ని అడుగులు వేస్తున్నామో చెప్పడమే కాదు, నిద్ర, మానసిక ప్రశాంతత, మనం తాగే నీరు, తినే తిండి వంటి ప్రతి విషయాన్ని గమనిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. మనతో నిత్యం ఉండి గైడ్ చేసే ఒక పర్సనల్ హెల్త్ కోచ్ లాంటిదన్నమాట. మన ఫిట్‌బిట్ యాప్‌లోనే ఈ ఏఐ ఫీచర్ ఉండబోతోంది. మనం చేసే ఎక్సర్‌సైజ్ వల్ల మన బాడీకి ఎంత ఉపయోగం ఉందనేది ఇది చాలా క్లియర్‌గా వివరిస్తుంది.

మార్కెట్లో పెరగనున్న పోటీ..

Advertisement

హూప్ కంపెనీలో క్రిస్టియానో రొనాల్డో వంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేయడంతో దానికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు గూగుల్ కూడా అదే రేంజ్‌లో బరిలోకి దిగుతోంది. యాపిల్ లాంటి కంపెనీలు ఇప్పటికీ స్క్రీన్ ఉన్న వాచీలకే ఇంపార్టెన్స్ ఇస్తుంటే.. గూగుల్ మాత్రం ఇలాంటి డిస్‌ప్లే లేని లైట్ వెయిట్ బ్యాండ్‌లపై ఫోకస్ పెట్టింది. గూగుల్ పిక్సెల్ వాచ్ లాంటివి వాడటం ఇష్టం లేని వాళ్లకు, లేదా పక్కాగా హెల్త్ ట్రాకింగ్ కావాలనుకునే వాళ్లకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఇది మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గూగుల్ ప్లాన్ చూస్తుంటే వేరబుల్ టెక్నాలజీలో కొత్త మార్పులు రావడం పక్కా అనిపిస్తోంది.

Also Read: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. హ్యాకర్ల కన్ను మీ ఫోన్ పైనే, అసలు ఏమిటీ మాల్వేర్?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×