E-Paper
Advertisement

జీహెచ్ఎంసీలొ 122 కొట్ల కుంభకొణం.. బయట పడిన డీసీ బండారం

జీహెచ్ఎంసీలొ 122 కొట్ల కుంభకొణం.. బయట పడిన డీసీ బండారం
Advertisement

GHMC: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీలో రోజుకో అక్రమం బయట పడుతుండటంతో ఉన్నతాధికారులు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా గత సంవత్సరం నవంబర్ 25న కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి పెరిగిన జీహెచ్ఎంసీ పరిధి మూడు కార్పొరేషన్లుగా ఏర్పడిన గత ఫిబ్రవరి 10వ తేదీ వరకు పట్టణ స్థానిక సంస్థల విలీనం జరుగుతున్న సమయంలో జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లలో ముఖ్యమైన శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఏం జరిగిందన్న విషయాన్ని వెలికితీసేందుకు విజిలెన్స్ విచారణ చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా విలీన సమయంలో 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీ, బర్త్ డెత్ సర్టిఫికెట్ల జారీ, ఇంజనీరింగ్ విభాగంలో పలు వెనులకు చేపట్టిన టెండర్లతో పాటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ..

ఈ క్రమంలో బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పై వరుసగా అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఉన్నతాధికారులు తొలుత విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి నివేదికలను కమిషనర్ కు పంపినా, నివేదికలు సక్రమంగా లేకపోవటంతో కమిషనర్ రహస్యంగా మరో విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ బాధ్యతలను అప్పగించటంతో నివేదికలో డిప్యూటీ కమిషనర్ అక్రమాలు, అవినీతి భారీగా వెలుగు చూశాయి. అంతేగాక, దాదాపు రూ. 122 కోట్ల అవినీతి జరిగినట్లు నివేదికలు వెల్లడించినట్లు తెలిసింది. ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ ప్రైవేటు విల్లాలకు జీహెచ్ఎంసీ నిధులతో రోడ్లు వేయటం, ఆక్రమించిన సర్కారు భూముల్లో నిర్మాణ అనుమతి కోసం భారీగా డబ్బులు చేతులు మారటం వంటి అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. అంతేగాక, హెడ్ క్వార్టర్ వెళ్లి వెళ్లరాదని కూడా ఆదేశించారు. ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ కమిషనర్ ను త్వరలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే సంబంధిత డిప్యూటీ కమిషనర్ కు ఏసీబీ లేఖ కూడా రాసినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Also Read: గ్రేటర్ ఎన్నికలు ఇక లేనట్టేనా.. జనగణన సాకుతో సర్కార్ అసలు ప్లాన్ ఇదేనా..!

ఆ టైమ్ లో ఏం జరిగింది?

బడంగ్ పేట మున్సిపల్ సర్కిల్ లో జరిగిన తరహాలోనే ఇతర సర్కిళ్లలో కూడా పట్టణ స్థానిక సంస్థల విలీన ప్రక్రియ మొదలుకుని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన ఫిబ్రవరి 10వ తేదీ వరకు సుమారు రెండున్నర నెలల వ్యవధిలో ఏం జరిగిందన్న విషయంపై అన్ని సర్కిళ్లలో బడంగ్ పేట తరహాలోనే విజిలెన్స్, ఏసీబీ విచారణలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సిద్దమైనట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ టైమ్ లో జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, మంజూరు చేసిన పనులు, జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు కొత్తగా చేపట్టిన ఇంజనీరింగ్ పనులుపై కూడా విజిలెన్స్ విచారించనున్నట్లు విశ్వసనీయంగా తెల్సింది. విలీన ప్రక్రియ మొదలుకుని, ఫిబ్రవరి 10వ తేదీ వరకు సుమారు 70 రోజుల్లో ఆయా సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వర్తించిన వారిని కూడా లోతుగా విచారించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆ టైమ్ లో విధులు నిర్వర్తించిన డిప్యూటీ కమిషనర్లలో ఎక్కువ మంది కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ లో గానీ, కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లలో గానీ విధులు నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. వాస్తవాలను వెలికితీసి ఏమైన అక్రమాలు, అవకతవకలు జరిగితే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

అక్రమాలిలా..

Advertisement

సర్కారు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తూ విధులు నిర్వర్తించాల్సిన బడంగ్ పేట డిప్యూటీ కమిషనర్ నిబంధనలకు విరుద్దంగా అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహారించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీవో నెం.201 ప్రకారం పనుల అంచనా వ్యయాన్ని బట్టి టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు కేటాయించాలన్న నిబంధన ఉంది. కానీ ఈ డిప్యూటీ కమిషనర్ రూ. కోటి విలువైన ఇంజనీరింగ్ పనికి మొత్తంగా టెండర్లు ప్రక్రియను చాలా డిఫెరెంట్ గా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం కోటి రూపాయల పనిని రూ. పది లక్షలుగా విభజిస్తూ నామమాత్రంగా టెండర్ల ప్రక్రియను నిర్వహించి తనకు నచ్చిన వారికి పనులను అప్పగించినట్లు తెలిసింది. ఈ రకంగా పనులు జరుగుతున్నా, ఒక రకంగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.

Also Read: బేకరీ ఫుడ్ తింటున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×