E-Paper
Advertisement

Tanveer Ahmed: బుమ్రా బౌలింగ్ కు ఎక్స్‌పైరీ డేట్ వ‌చ్చేసింది..ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే

Tanveer Ahmed: బుమ్రా బౌలింగ్ కు ఎక్స్‌పైరీ డేట్ వ‌చ్చేసింది..ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఇందులో తోపు ఆటగాళ్లు ఉన్నా కూడా వరుసగా ఓడిపోతోంది ముంబై ఇండియన్స్ ( Mumbai indians). ముఖ్యంగా బుమ్రా ఐదు మ్యాచ్ ల‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇలా వికెట్ తీయకుండా చెత్త ప్రదర్శన ఎప్పుడు చేయలేదు బుమ్రా. దీంతో అతని బౌలింగ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే బుమ్రా బౌలింగ్ పై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ( Bumrah) బౌలింగ్ కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందని.. ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని చురకలు అంటించారు. ఇక పైన‌ అతడు ఎన్ని యార్కర్లు వేసినా కూడా పనిచేయబోదని బాంబు పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

ఐదు మ్యాచ్ ల‌లో ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  నేపథ్యంలో బుమ్రా ( Jasprit bumrah) ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అతని పర్ఫామెన్స్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ పైన ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా, 35 పరుగులు సమర్పించేసుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పైన నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే రాజస్థాన్ రాయల్స్ ( RR) పైన కేవలం 3 ఓవర్లే వేశాడు.

అక్కడ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక నిరాశపరిచాడు. మొన్న బెంగళూరు పైన నాలుగు ఓవర్లలో 35 పరుగులు.. నిన్న పంజాబ్ పైన నాలుగు ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వికెట్ మాత్రం సాధించలేదు బుమ్రా. ఇలా 5 ఓవర్లలో చెత్త ప్రదర్శన కనబరిచి ఒక్క వికెట్ తీయకుండా బుమ్రా అభాసుపాలవుతున్నాడు. దీంతో బుమ్రాపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తో పాటు యాజమాన్యం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

బుమ్రా రిటైర్మెంట్ టైం వచ్చేసింది

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా బౌలింగ్ లో పసలేదని.. అతని యార్కర్లకు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వెంటనే రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ సూచనలు చేశారు.

 

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×