E-Paper
Advertisement

ఎడిటింగ్ స్కిల్స్ అక్కర్లేదు.. Gemini Omniలో జస్ట్ టెక్ట్స్ ఇస్తే చాలు వీడియో రెడీ అయిపోద్ది!

ఎడిటింగ్ స్కిల్స్ అక్కర్లేదు.. Gemini Omniలో జస్ట్ టెక్ట్స్ ఇస్తే చాలు వీడియో రెడీ అయిపోద్ది!
Advertisement

Google Gemini Omni: సాధారణంగా వీడియో ఎడిటింగ్ అనగానే మనకు రకరకాల సాఫ్ట్‌వేర్‌లు, గంటల కొద్దీ కూర్చొని ఎడిట్ చేయడం గుర్తొస్తాయి. కానీ ఇకపై ఆ సమస్య అక్కర్లేదు. ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా, కేవలం మనం ఇచ్చే కమాండ్స్‌తో వీడియోలను మార్చేసే సరికొత్త Gemini Omni వీడియో ఎడిటింగ్ ఫీచర్‌ను గూగుల్ భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఐ/ఓ 2026 ఈవెంట్‌లో ప్రకటించిన ఈ టెక్నాలజీతో మొబైల్ యాప్ లేదా బ్రౌజర్ ద్వారా సులువుగా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.

కేవలం మాటలతోనే ఎడిటింగ్:

ఈ సరికొత్త ఫీచర్‌తో వీడియో ఎడిటింగ్ ప్రక్రియ ఎంతో సరళంగా మారింది. మనం చేయాల్సిందల్లా జెమినీ యాప్‌లో వీడియో అప్‌లోడ్ చేసి, అందులో ఎలాంటి మార్పులు కావాలో స్పష్టంగా టైప్ చేయడమే. ఉదా: వీడియో బ్యాక్‌గ్రౌండ్ మార్చాలన్నా, ఒక కొత్త క్యారెక్టర్‌ను చేర్చాలన్నా కేవలం ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ పైన జెమినీ ఆ వీడియోను ప్రాసెస్ చేసి, మార్పులు పూర్తి చేసిన తర్వాత మీకు చూపిస్తుంది. నచ్చితే దాన్ని వెంటనే సేవ్ చేసుకోవచ్చు.

సహజమైన మార్పులు:

Advertisement

గూగుల్ ఈ జెమినీ ఓమ్నీని కేవలం ఎడిటింగ్ కోసమే కాకుండా.. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా రూపొందించింది. దీనిలో రియల్ వరల్డ్ ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించడం వల్ల మనుషుల నడక, వస్తువులు కింద పడటం, ద్రవాలు వలకడం వంటివన్నీ నిజ జీవితంలో ఎలా జరుగుతాయో అలాగే సహజంగా కనిపిస్తాయి. పైగా మనం ఒకసారి ఇచ్చిన సూచనలను గుర్తుంచుకుని, తదుపరి మార్పుల్లో కూడా అదే స్టైల్, కంటిన్యూటీని ఇది మెయింటైన్ చేస్తుంది.

Also Read: CCTV కంటే డేంజర్‌గా మారనున్న Wi-Fi.. ఇంట్లో మనుషుల కదలికలను కూడా పసిగట్టొచ్చంటున్న నిపుణులు!

ఊహకు తగ్గ క్రియేటివిటీ:

Advertisement

ఈ టూల్ కేవలం వీడియోలకే పరిమితం కాలేదు. ఫొటోలు, చేతితో గీసిన స్కెచ్‌లు, వాయిస్ శాంపిల్స్ వంటి వాటిని కూడా జెమినీకి ఇన్‌పుట్‌గా ఇచ్చి కొత్త కంటెంట్‌ను సృష్టించవచ్చు. త్వరలోనే మన రూపాన్ని, వాయిస్‌ని ఉపయోగించి డిజిటల్ అవతార్‌లను క్రియేట్ చేసే సదుపాయం కూడా రాబోతోంది. ప్రస్తుతం కేవలం ఆడియో రిఫరెన్స్ ఫీచర్ మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి వాయిస్ జనరేషన్ ఫీచర్లు రానున్నాయి.

భద్రత, పారదర్శకత:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసిన వీడియోల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా గూగుల్ గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. జెమినీ ఓమ్నీ ద్వారా ఎడిట్ చేసిన ప్రతి వీడియోకు SynthID అనే అదృశ్య వాటర్‌మార్క్‌ను జోడిస్తుంది. దీనివల్ల క్రోమ్ లేదా గూగుల్ సెర్చ్‌లో ఆ వీడియోను చూసినప్పుడు అది ఏఐతో క్రియేట్ చేసిందని సులువుగా గుర్తించవచ్చు. దీనికోసం ఓపెన్ ఏఐ, ఎలెవన్ ల్యాబ్స్, ఎన్విడియా వంటి ప్రముఖ సంస్థలతో గూగుల్ కలిసి పనిచేస్తోంది.

Also Read: Google Pixel 10a ధర భారీగా పెంపు.. కానీ ఈ ఒక్క ట్రిక్‌తో పాత ధరకే సొంతం చేసుకోవచ్చు!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×