E-Paper
Advertisement

Google Pixel 10a ధర భారీగా పెంపు.. కానీ ఈ ఒక్క ట్రిక్‌తో పాత ధరకే సొంతం చేసుకోవచ్చు!

Google Pixel 10a ధర భారీగా పెంపు.. కానీ ఈ ఒక్క ట్రిక్‌తో పాత ధరకే సొంతం చేసుకోవచ్చు!
Advertisement

Pixel 10a Price Hike: భారతదేశంలో పిక్సెల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, గూగుల్ అభిమానులకు కంపెనీ ఒక చేదు వార్త చెప్పింది. పెరిగిపోతున్న విడిభాగాల ఖర్చులు, తయారీ వ్యయం కారణంగా గూగుల్ తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ Pixel 10a ధరను ఒక్కసారిగా పెంచేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

ఎంత పెరిగింది? కొత్త ధర ఎంత?

Google Pixel 10a ఫోన్ మనదేశంలో ఒకే ఒక్క వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్)తో లాంచ్ అయింది. విడుదల సమయంలో దీని ధర రూ.49,999గా ఉండేది. కానీ ఇప్పుడు గూగుల్ దీనిపై ఏకంగా రూ.6,000 పెంచేసింది. దీనివల్ల ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.55,999కి చేరింది. అయితే ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఇంకా పాత ధరలకే కొన్ని ఆఫర్లు నడుస్తుండటం కొసమెరుపు.

Advertisement

Also Read: సింగిల్ ఛార్జ్‌తో 19 గంటల బ్యాటరీ.. ఏసర్ నుంచి అద్భుతమైన AI ల్యాప్‌టాప్ లాంచ్!

ధరకు తగ్గ అధునాతన ఫీచర్లు:

ధర పెరిగినా కూడా ఈ ఫోన్ ఇచ్చే ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. దీనిలో 6.3 ఇంచుల డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ఉన్నాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. గూగుల్ టెన్సార్ G4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఫోటోల కోసం 48MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉన్నాయి. అలాగే 5100mAh బ్యాటరీతో పాటు ఇది ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది.

ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్:

Advertisement

ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం దీని సాఫ్ట్‌వేర్ సపోర్ట్. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ మొబైల్‌కు ఏకంగా 7 ఏళ్లపాటు ఓఎస్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని గూగుల్ హామీ ఇచ్చింది. ప్రస్తుతానికి అధికారిక స్టోర్‌లో ధర పెరిగినా.. ఇతర ఆన్‌లైన్ రిటైలర్ల దగ్గర రేట్లు మారేలోపు కొనుక్కుంటే మంచి డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

Also Read: ప్రయాణాల్లో 5G నెట్‌వర్క్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? జరిగే నష్టం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు!

Related News

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

Big Stories

Advertisement
×