E-Paper
Advertisement

Realme 16T భారత్‌లో లాంచ్.. 144Hz డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు!

Realme 16T భారత్‌లో లాంచ్.. 144Hz డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు!
Advertisement

Realme 16T: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ సరికొత్త తమ మిడ్‌రేంజ్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది తీసుకొచ్చింది. Realme 16T పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ ముఖ్యంగా భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ కెమెరా, గట్టిదనం కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ వచ్చింది. ప్రీమియం లుక్‌తో పాటు బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ఫోన్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం:

ఈ Realme 16Tలో అందరినీ ఆకట్టుకునే ప్రధాన ఫీచర్ దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా వాడుకుంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనివల్ల 100 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. గేమర్స్ కోసం బైపాస్ ఛార్జింగ్, వేరే ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

Advertisement

Realme 16Tలో 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది కాబట్టి.. స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. అలాగే 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.

Also Read: హోమ్ థియేటర్ రేంజ్ సౌండ్.. బ్లౌపంక్ట్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ల స్పెషాలిటీ ఇదే!

ఏఐ ఫీచర్లతో కెమెరాలు:

Advertisement

ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP సోనీ ప్రైమరీ కెమెరాతో పాటు మోనోక్రోమ్ సెన్సార్‌ను అందించారు. రీల్స్, షార్ట్ వీడియోలు చేసుకునే వారి కోసం ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు ఉన్న సెల్ఫీ మిర్రర్ సాయంతో మెయిన్ కెమెరాతోనే మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇక వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16MP కెమెరా ఉంది.

మిలిటరీ గ్రేడ్ గట్టిదనం..

ఫోన్ కింద పడినా పాడవకుండా ఉండేందుకు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, స్క్రీన్‌కు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP69 రేటింగ్ ఉంది. ధరల విషయానికి వస్తే.. 6GB+128GB వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8GB+128GB ధర రూ.31,999, టాప్ ఎండ్ 8GB+256GB మోడల్ ధర రూ.34,999గా ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లలో లభించే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లాంచ్ ఆఫర్ కింద డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: రూ.5 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఇయర్‌బడ్స్.. 54 గంటల బ్యాటరీతో OPPO Enco Air 5 Pro లాంచ్!

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×