E-Paper
Advertisement

ఐఫోన్‌కు గట్టి పోటీగా గూగుల్ కొత్త స్కెచ్.. Pxel 11లో ఎవరూ ఊహించని సరికొత్త Glow ఫీచర్!

ఐఫోన్‌కు గట్టి పోటీగా గూగుల్ కొత్త స్కెచ్.. Pxel 11లో ఎవరూ ఊహించని సరికొత్త Glow ఫీచర్!
Advertisement

Google Pixel 11: గూగుల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ‘గూగుల్ పిక్సెల్ 11’ సిరీస్‌కు సంబంధించిన మొదటి అధికారిక టీజర్‌ను సంస్థ విడుదల చేసింది. న్యూయార్క్ నగరంలో ఆగస్టు 12న జరగబోయే ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో ఈ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ టీజర్ ద్వారా పిక్సెల్ 11 బ్రాండింగ్‌తో పాటు ఫోన్ వెనుక భాగంలో వచ్చే ఒక వినూత్నమైన లైటింగ్ ఫీచర్‌ను గూగుల్ అధికారికంగా ఖరారు చేసింది.

వెలిగిపోనున్న పిక్సెల్ గ్లో:

గూగుల్ స్టోర్ హోమ్‌పేజీలో కనిపించిన ఈ టీజర్ వీడియోలో గోల్డ్ కలర్ పిక్సెల్ ఫోన్ మెరిసిపోతూ కనిపించింది. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన విశేషం Pixel Glow. సాధారణంగా ఫోన్లలో వచ్చే నోటిఫికేషన్ లైట్లలా కాకుండా.. కెమెరా పక్కన ఉండే ఫ్లాష్ ఏరియాలోనే ఈ సరికొత్త లైటింగ్ ఫీచర్‌ను అమర్చారు. ఇది రకరకాల రంగుల్లో వెలుగుతూ యానిమేషన్ తరహాలో కనిపిస్తుంది. దీంతో ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్ రానుంది. అయితే ఈ లైట్ ఏయే పనులకు, ఎలా ఉపయోగపడుతుందనే వివరాలను గూగుల్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.

అదే రోజు నుంచే ప్రీ-ఆర్డర్స్:

Advertisement

కొత్త ఫోన్ కొనాలనుకునే వారి కోసం లాంచ్ రోజే ప్రీ-ఆర్డర్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12న ఈవెంట్ ముగిసిన వెంటనే బుకింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. అమెరికాలో ఉన్న వినియోగదారులు జులై 15 నుంచి ఆగస్టు 7 లోపు గూగుల్ స్టోర్‌లో తమ ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకుంటే, వారికి ఆగస్టు 11న ఒక ప్రత్యేక ప్రొమో కోడ్ వస్తుంది. దీని ద్వారా పిక్సెల్ 11 సిరీస్ కొనుగోలుపై మంచి ఆఫర్లను పొందవచ్చు.

Also Read: పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. Motorola Edge 70 Max ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

మరిన్ని డివైజ్‌లు:

Advertisement

ఈసారి లాంచ్ ఈవెంట్‌లో పిక్సెల్ 11 బేసిక్ మోడల్‌తో పాటు పిక్సెల్ 11 ప్రో, ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మోడళ్లను కూడా లాంచ్ చేయనున్నారు. వీటిలో శాంసంగ్ కంపెనీకి చెందిన అత్యాధునిక డిస్‌ప్లేలు, 2 నానోమీటర్ టెక్నాలజీతో తయారైన గూగుల్ స్వంత Tensor G6 ప్రాసెసర్‌ను వాడబోతున్నట్లు తెలుస్తోంది. కెమెరా పనితీరును కూడా మరింత మెరుగుపరిచారు. ఈ ఫోన్లతో పాటు సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘పిక్సెల్ వాచ్ 5’ను కూడా రెండు వేర్వేరు సైజుల్లో గూగుల్ రంగంలోకి దించనుంది.

జెమిని ఏఐ స్మార్ట్‌నెస్:

ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్‌కు తగ్గట్టుగా.. పిక్సెల్ 11 సిరీస్‌లో గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లను భారీగా చేర్చనుంది. వాయిస్ అసిస్టెంట్ నుంచి ఫొటో ఎడిటింగ్ వరకు ప్రతి విషయంలోనూ గూగుల్ ఏఐ టెక్నాలజీ ఈ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చనుంది. మొత్తానికి ఈ సరికొత్త సిరీస్ మొబైల్ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది.

Also Read: యాపిల్ iPad Mini లవర్స్‌కు భారీ షాక్.. ఆ ఒక్క ఫీచర్ తీసేసి పెద్ద తప్పు చేశారా?

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×