E-Paper
Advertisement

యాపిల్ iPad Mini లవర్స్‌కు భారీ షాక్.. ఆ ఒక్క ఫీచర్ తీసేసి పెద్ద తప్పు చేశారా?

యాపిల్ iPad Mini లవర్స్‌కు భారీ షాక్.. ఆ ఒక్క ఫీచర్ తీసేసి పెద్ద తప్పు చేశారా?
Advertisement

iPad Mini 2026: యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఐప్యాడ్ మిని ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతోంది. ఈ సారి డిస్‌ప్లే విషయంలో యాపిల్ సంస్థ ఒక పెద్ద మార్పు చేయబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. ఇప్పటివరకు వస్తున్న పాత ఎల్‌సీడీ స్క్రీన్‌ల స్థానంలో, మొదటిసారిగా ఓఎల్ఈడీ డిస్‌ప్లేను తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. దీనికోసం శాంసంగ్ కంపెనీ ఇప్పటికే ప్యానెళ్ల తయారీని కూడా ప్రారంభించినట్లు సమాచారం.

రిఫ్రెష్ రేట్ నిరాశపరుస్తుందా?

ఓఎల్ఈడీ స్క్రీన్ అనగానే అదిరిపోయే కలర్స్, సూపర్ కాంట్రాస్ట్ ఆశించవచ్చు. అయితే.. గేమర్స్, పవర్ యూజర్లకు ఒక చిన్న నిరాశ తప్పేలా లేదు. ఈ కొత్త ఐప్యాడ్ మిని కేవలం 60Hz రిఫ్రెష్ రేట్‌తోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ప్రో మోడల్స్‌లో ఉండే స్మూత్ 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ దీనిలో ఉండకపోవచ్చు. స్క్రోలింగ్, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉండాలని కోరుకునే వారికి ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలా? కరెంట్ ఆదా చేయడంలో వీటికి తిరుగులేదు!

డిస్‌ప్లే సైజ్ పెరగనుంది:

తాజా లీక్స్ ప్రకారం.. ఈ కొత్త ఐప్యాడ్ మిని 8.4 అంగుళాల హైబ్రిడ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ 8.3 అంగుళాల స్క్రీన్‌తో ఉంది. అంటే.. పాతదానితో పోలిస్తే కొత్త స్క్రీన్ కొంచెం పెద్దదిగా, మరింత స్పష్టంగా కనిపించనుంది. రేటును అదుపులో ఉంచడానికే యాపిల్ సంస్థ 120Hz టెక్నాలజీ కాకుండా, 60Hz రిఫ్రెష్ రేట్‌కే పరిమితమైనట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

పవర్‌ఫుల్ ఏ18 చిప్‌సెట్:

Advertisement

ఈ ట్యాబ్‌లో కేవలం డిస్‌ప్లే మాత్రమే కాదు.. పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఐఫోన్ 16 సిరీస్‌లో వాడిన లేటెస్ట్ ఏ18 (A18) చిప్‌ను దీనిలో అమర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గ్రాఫిక్స్, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటాయి. అంతేకాదు.. యాపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కూడా దీనికి సపోర్ట్ చేయనున్నాయి. దీంతో స్మార్ట్ రైటింగ్ టూల్స్, ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను ఈ చిన్న ట్యాబ్‌లోనే వాడుకోవచ్చు.

లాంచ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది మూడో త్రైమాసికంలోనే (Q3 2026) ఈ సరికొత్త ఐప్యాడ్ మిని విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్‌ప్లే క్వాలిటీ పరంగా ఇది సూపర్ అప్‌గ్రేడ్ అయినప్పటికీ.. హై రిఫ్రెష్ రేట్ కోరుకునే వారికి మాత్రం ప్రో మోడల్స్ వైపే చూడక తప్పదు.

Also Read: టైటానియం ఫ్రేమ్, అదిరిపోయే లుక్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×