E-Paper
Advertisement

రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?

రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?
Advertisement

Yedukondalu Death: ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, ఘోరాల తీవ్రత కంటే.. వాటి చుట్టూ నడిచే రాజకీయాలు, మాటల యుద్ధాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒక ఘటన జరగడమే ఆలస్యం, నిజా నిజాలు తేలకముందే పార్టీలు మైకులు పట్టుకుని విమర్శలు గుప్పించుకోవడం ఏపీ పాలిటిక్స్ లో కామన్ అయిపోయింది. తాజాగా నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఏడుకొండలు మృతి వ్యవహారం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను ఒక్కసారిగా పెంచేసింది.

ఏడుకొండల మృతి.. కాకాణి వర్సెస్ సోమిరెడ్డి*

Advertisement

నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మృతి చెందడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇది ముమ్మాటికీ పోలీసుల అత్యుత్సాహం వల్ల జరిగిన ‘లాకప్ డెత్’ అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మోటార్ల దొంగతనం కేసులో పోలీసులు ఏడుకొండలను ఎంక్వైరీ చేసి వదిలేశారని, దీనికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండోసారి విచారణకు పిలిస్తే రాలేదని, ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.

Also Read: ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!

Advertisement

సాయికృష్ణ ఎపిసోడ్ నుండి ఇదే ట్రెండ్

గతంలో జరిగిన సాయికృష్ణ వ్యవహారంలోనూ ఇరు పార్టీలు ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఇప్పుడు ఏడుకొండలు కేసులోనూ అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో యాక్టివ్‌గా పనిచేసిన పోలీసులను, ప్రభుత్వం మారగానే ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం ఇక్కడ రొటీన్‌గా మారింది. ‘మా పాలనలోనే లా అండ్ ఆర్డర్ బాగుంది’ అని ప్రజలకు ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఇరు పార్టీలు తాపత్రయపడుతున్నాయి.

నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి?

ఇలాంటి సున్నితమైన కేసుల్లో రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, పారదర్శకంగా విచారణ జరిపించి నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అప్పుడే పోలీస్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. కానీ.. ఏపీలో మాత్రం సీన్ పూర్తిగా డిఫరెంట్. విచారణలు పక్కకెళ్లి, రాజకీయ బురదజల్లే కార్యక్రమాలే ఎక్కువగా నడుస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇకనైనా రాజకీయ పార్టీలు తమ పంథాను, స్టాండ్‌ను మార్చుకుంటాయా? లేదా ఇదే పొలిటికల్ డ్రామాను కంటిన్యూ చేస్తాయా? అనేది ప్రస్తుతానికైతే పెద్ద ప్రశ్నార్థకమే!

Also Read: 8 సార్లు పేలుళ్ల ట్రయల్స్.. గుజరాత్‌లో ‘జైష్’ ఉగ్ర కుట్ర భగ్నం.. 13 మంది అరెస్ట్!

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×